7th pay commission: సెంట్రల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకోండి..!
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో ఒక శుభవార్త రానుంది. ఈ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల వేతనం విషయంలో.. కేంద్రం ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. దానితో ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA) పెరుగనుంది. దీని ద్వారా వారి జీతాల్లో కూడా భారీగానే పెరుగుదల ఉంటుంది.
ప్రతీ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులు జూలై నుండి సెప్టెంబర్ వరకు DA పెంపు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇది కేవలం తక్కువ స్థాయి ఉద్యోగులు మాత్రమే కాకుండా ఉన్నతస్థాయి అధికారులకు కూడా వర్తిస్తుంది. 7వ వేతన కమిషన్ (Pay Commission) ప్రకారం, ఉద్యోగుల జీతాలతో పాటు DA కూడా ప్రతి ఏడాది రెండుసార్లు పెరుగుతుంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, జనవరి నుండి జూన్ 2024 వరకు AICPI IW సూచిక డేటా ఆధారంగా ఉద్యోగులకు 3 శాతం DA పెరుగుదల ప్రకటించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. జూన్ AICPI సూచికలో 1.5 పాయింట్లు పెరిగిన తర్వాత, ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వం 3% పెంపును ప్రకటించి, మొత్తం DA ను 53 శాతానికి పెంచనుంది.
ఈ నిర్ణయం సెప్టెంబర్ 25న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రూ. 50 వేల జీతం పొందుతున్న ఉద్యోగి జీతం సుమారు రూ. 1500 పెరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో, కేంద్ర ప్రభుత్వం DAలో 4 శాతం పెంపు ప్రకటించింది. దీని ద్వారా DA 50 శాతానికి చేరింది, ఇది ఉద్యోగులకు నిజంగా మంచి వార్త.
సాధారణంగా DA లేదా DR పెంపు జనవరి 1న, జూలై 1న ప్రారంభమవుతుంది, కానీ ఎప్పుడూ ఆలస్యం అవుతునే ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు గత నెలల DA పెంపు పెండింగ్ లోనే ఉండిపోతుంది. 2023 సంవత్సరంలో DA పెంపు 2023 అక్టోబర్ 18న ప్రకటించబడింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే కొత్త నిర్ణయం కోట్లాది ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తి ఎదురుచూస్తున్నారు.