7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త
7th Pay Commission Latest News: COVID-19 మహమ్మారి కారణంగా గత ఏడాది ప్రయాణానికి సంబంధించి పలు ఆంక్షల్ని కేంద్రం విధించింది. కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణ ఖర్చులకు బదులుగా 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ జీఎస్టీ రేటును చెల్లించిన వస్తువులు మరియు సేవల కొనుగోలుపై పన్ను మినహాయింపు పొందవచ్చు. 2020 అక్టోబర్ 12 నుండి 2021 మార్చి 31 మధ్య చేయనున్న ఖర్చులపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చునని 7వ వేతన సంఘం (7th Pay Commission) లేదా కేంద్ర వేతన సంఘం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees) మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు LTC స్కీమ్‌లో భాగంగా జీవిత బీమా(Life insurance) కూడా చేర్చారని తెలుసుకోవాలి. తద్వారా మీరు మీ లైఫ్ ఇన్సూరెన్స్‌లను ఇందులో క్లెయిమ్ చేసుకుంటే ఆదాయ పన్ను నుంచి కాస్త మినహాయింపు పొందవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి పరిమితిని దాటిపోయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేర్చుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్త సౌకర్యంపై ప్రాఫిట్ మార్ట్ పంకజ్ మఠపాల్ ఏమన్నారంటే.. ‘కొత్త పాలసీలకు చెల్లించిన ప్రీమియంపై ఎల్‌టిసి పథకం కింద ఆదాయపు పన్ను ప్రయోజనం పొందవచ్చు. అక్టోబర్ 12, 2020 నుండి 2021 మార్చి 31 మధ్యకాలంలో తీసుకున్న కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నవారు అర్హులు. కాబట్టి పన్ను ప్రయోజనం పొందడానికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త జీవిత బీమా పాలసీని ఈ నెల 31 వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది టర్మ్ ప్లాన్ లేదా ULIP లేదా యాన్యుటీ లేదా ఎండోమెంట్ ప్లాన్’ అయి ఉండాలని వివరించారు.
Also Read: 7th Pay Commission: తెరపైకి కొత్త వేతన కోడ్, PF Contributionతో పాటు ఉద్యోగుల జీతాల్లో మార్పులు
ఒకవేళ ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80 సి కింద ఆదాయపు పన్ను ప్రయోజనం ఇప్పటికే క్లెయిమ్ చేసి ఉంటే.. వారు పన్ను ప్రయోజనాన్ని ఎల్‌టిసి స్కీమ్ కింద క్లెయిమ్ చేయలేమని పంకజ్ మత్పాల్ తెలిపారు. కనుక 80 సి పరిమితి దాటిపోయిన కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, అతను లేదా ఆమె ఇప్పటికీ ఎల్‌టీసీ పథకం కింద ప్రయోజనాలను పొందవచ్చునని ఏడవ వేతన సంఘం స్పష్టం చేసింది.
7వ వేతన సంఘం లబ్ధిదారుడు అయితన ప్రభుత్వ ఉద్యోగి మార్చి 31 లోగా కొత్త ప్రీమియం కొనుగోలు చేసి, అతను లేదా ఆమె మొత్తం ప్రీమియంపై లేదా దాని గరిష్ట ఎల్‌టీసీ బెనిఫిట్ మొత్తంలో ఏది తక్కువైతే అది ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందుతుందని ప్రాఫిట్‌మార్ట్‌కు చెందిన పంకజ్ మత్పాల్ తెలిపారు. కానీ ఆ కాలంలో జారీ చేసిన రెగ్యులర్ ప్రీమియం పాలసీల ఎల్‌టిసి పరిమితిలో ఉంటే 2021 మార్చి 31 వరకు చెల్లించిన ప్రీమియం మొత్తాలకు ప్రయోజనాలు లభిస్తాయి.