7th Pay Commission: తెరపైకి కొత్త వేతన కోడ్, PF Contributionతో పాటు ఉద్యోగుల జీతాల్లో మార్పులు

7th Pay Commission Latest Update 2021: కొత్త వేతన కోడ్ అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేయనుంది. రెండేళ్ల కిందటే కొత్త వేతన కోడ్‌(New Wage Code)ను ప్రతిపాదించారు. ఏప్రిల్ 1, 2021 నుంచి అమలు కానుంది కథనాలు వస్తున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 10, 2021, 01:09 PM IST
  • ఏప్రిల్ 1 నుండి వారి నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీ మారనున్నాయి
  • కొత్త వేతన సవరణ అమలులోకి వస్తే ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ పాస్‌బుక్ బ్యాలెన్స్‌
  • కొత్త వేతన కోడ్‌ను కలిగి ఉన్న నాలుగు లేబర్ కోడ్‌ అమలు కోసం యత్నాలు
7th Pay Commission: తెరపైకి కొత్త వేతన కోడ్, PF Contributionతో పాటు ఉద్యోగుల జీతాల్లో మార్పులు

7th Pay Commission Latest News: 2021 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుండి వారి నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీ మారనున్నాయి. కొత్త వేతన సవరణ అమలులోకి వస్తే ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund)లో ప్రైవేటు ఉద్యోగుల ఈపీఎఫ్ పాస్‌బుక్ బ్యాలెన్స్‌లో ప్రభావం చూపుతుంది.

ఈ కొత్త వేతన కోడ్‌(New Wage Code) అమల్లోకి వస్తే సీటీసీలో నెలవారీ వేతనంలో ఉద్యోగులు మూల వేతనం(Basic Salary) కచ్చితంగా కనీసం 50 శాతం ఉండాలి. 2021 ఏప్రిల్ 1 నుండి కొత్త వేతన కోడ్ అమలైతే ఉద్యోగికి అందే అలవెన్సులు నెలవారీ జీతంలో 50 శాతానికి మించి అందుకోలేరు. బడ్జెట్ కేటాయింపులు మరియు నిబంధనలను వివరిస్తూ 7th Pay Commission నిర్ణయాలపై కార్మిక మరియు ఉపాధి కార్యదర్శి అపుర్వ చంద్ర మాట్లాడుతూ, కొత్త వేతన కోడ్‌ను కలిగి ఉన్న నాలుగు లేబర్ కోడ్‌ల కోసం ఇప్పటికే అమలు కోసం యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

Also Read:Gold Price Today: బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం ధరలు, రికార్డు స్థాయికి చేరిన Silver Price

‘ఈ మంత్రిత్వ శాఖ త్వరలో నాలుగు కోడ్స్‌ను అమలులోకి తెస్తుంది. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులు మరియు సామాజిక భద్రతా సంకేతాలు’ అని అపుర్వ చంద్ర వెల్లడించారు.

కొత్త వేతన కోడ్ మీ PF, గ్రాట్యుటీని ఎలా ప్రభావితం చేస్తుంది..
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలు మూల వేతనం(Basic Salary)పై ఆధారపడి ఉంటాయని తెలిసిందే. కొత్త వేతన కోడ్ అమలు తరువాత ఉద్యోగుల పీఎఫ్(Provident Fund), మరియు గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్‌లో మార్పులు రానున్నాయి. కొత్త వేతన కోడ్ అమలు అవుతుందో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశాలున్నాయి.

Also Read: PM Kisan Samman Nidhi నిబంధనల్లో భారీ మార్పులు, ఇకపై వారికి రూ.6 వేలు జమ కావు

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ 2019లో కొత్త వేతన కోడ్‌ను ప్రకటించారు. కానీ దీని అమలుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే కార్మిక మరియు ఉపాధి కార్యదర్శి అపుర్వ చంద్ర స్పందించిన తరువాత కొత్త వేతన కోడ్ అమలుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు

కేంద్ర ప్రభుత్వం వేతన కోడ్‌ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ నెలవారీ కొత్త కాంట్రిబ్యూషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే దానిపై స్పష్టత లేదు. అయితే పీఎఫ్, గ్రాట్యుటీ కచ్చితంగా మారుతాయని, గతంలో మాదిరిగా ఉండవని తెలుస్తోంది. 

Also Read: SBI Alert: ఎస్‌బీఐ అకౌంట్‌కు PAN కార్డ్ లింక్ చేసుకోకపోతే ఈ ట్రాన్సాక్షన్ చేయలేరు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News