DA Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ గుడ్‌న్యూస్, ఈసారి డీఏ, జీతం పెంపు ఎంతంటే
ద్రవ్యోల్బణం, రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తుధరల్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ ఏడాదికి రెండు సార్లు పెంచుతుంటుంది.
డీఏ పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం కూడా పెరుగుతుంది. 18 వేలు కనీస వేతనం ఉంటే డీఏ 56 శాతమైతే డీఏ నెలకు 540 రూపాయలు పెరుగుతుంది.
ఇప్పుడు వచ్చే ఏడాది అంటే 2025 జనవరిలో డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. ఇది జూలై నుంచి డిసెంబర్ వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది.
నిరుడు ఏడాదిలో జూలై నుంచి డిసెంబర్ వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డీఏ నిర్ణయిస్తుంటారు. జనవరి నుంచి జూన్ వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జూలై డీఏ నిర్ణయిస్తారు.
ఈ ఏడాది అంటే జనవరి నెలలో డీఏ 4 శాతం పెరగగా జూలై నెలలో 3 శాతం పెరిగింది. డీఏ, డీఆర్ రెండూ ఇటీవల 3 శాతం పెరిగాయి.
7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెరగనుంది. ప్రతి యేటా జనవరి, జూలై నెలల్లో ఇది పెరుగుతుంటుంది.
కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెలా ఏఐసీపీఐ ఇండెక్స్ జారీ చేస్తుంటుంది. ఈ సూచీ ప్రకారం జూలై సెప్టెంబర్ నెలలో 141.5 కు చేరుకుంది. ఖర్చుల మార్క్ 54.49 శాతానికి చేరుకుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉంది. డిసెంబర్ నాటికి ఇండెక్స్ 144-145 ఉండి డీఏ 55 కంటే తక్కువగా ఉంటే డీఏ 3 శాతం పెరుగుతుంది.
DA Salary Hike in Telugu: కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ప్రతి ఏటా రెండు సార్లు జీఏ పెంపు ఎంతనేది నిర్ణయిస్తుంటారు. 7వ వేతన సంఘం ప్రకారం 65 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షలమంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈసారి ఏ మేరకు డీఏ పెరగనుందో చెక్ చేద్దాం.