Dussehra Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్.. నేరుగా ఖాతాల్లోకి రూ.18000 బోనస్!
రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న బోనస్‌ను ఏడవ వేతన సంఘం ప్రకారం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బోనస్ లెక్కింపులో ఆరవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం రూ.7000ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే రైల్వే ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ప్రకారం 2016 జనవరి ఒకటి నుంచే వేతనాలు లభిస్తున్నాయి. 7th pay commission ప్రకారం కనీస వేతనం రూ.18,000 కాబట్టి బోనస్ లెక్కింపులో ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
7th pay commission ప్రకారం జీతాలు పొందుతున్నప్పటికీ, బోనస్ లెక్కింపులో 6th pay commission ప్రకారం కనీస వేతనం పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్న బేసిక్ శాలరీ రూ.7, 000 కాగా... అనుకున్న లెక్క ప్రకారం ఉద్యోగులకు బోనస్ రూ.17,951 వచ్చే అవకాశాలు ఉన్నాయి.. రైల్వే ఉద్యోగుల ప్రస్తుతం ఈ శాలరీ సరిపోదని వాపోతున్నారు.
రైల్వే ఉద్యోగుల దసరా బోనస్ విషయంపై చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బోనస్ లెక్కించే రోజులు, కనీస వేతనం ఆధారంగా లెక్కించే విధానంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 ఉంది. ఇంతకుముందు 76 రోజులకు లెక్కించాలని ప్రతిపాదించారు.
78 రోజుల బోనస్‌గా రూ.18,000 కనీస వేతనం ఉన్న ఉద్యోగులకు దాదాపు లెక్కల ప్రకారం రూ.46,159 అందాల్సి ఉంటుంది. అయితే కనీస వేతన సీలింగ్ పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 7వ వేతన సంఘం ప్రకారం లెక్కలు వేయాలని కోరుతున్నారు. 78 రోజుల బోనస్ కూడా కనీస వేతనం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని కొంతమంది ఉద్యోగులకు ఆందోళ చెందుతున్నారు.
7th pay commission ప్రకారం లెక్కలు వేస్తే దసరా బోనస్ జీతంకు రెండింతలకు పైగా పెరగనుందని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.