7Th Pay Commission: అదిరిపోయే దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు 24 గంటల్లో DAతో పాటు జీతాలు రూ.9 వేల పెంపు!
కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ కీలక నిర్ణయం ద్వారా 1 కోటి మంది ఉద్యోగులకు పైగా లబ్ధి జరుగుతుందని సమాచారం. ముఖ్యంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు చాలా మేలు జరుగుతుంది.
7వ వేతన సంఘం జీతాలు పెంపు, DA గురించి కీలక ప్రకటన చేస్తే.. ముందుగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోటీ మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ కీలక నిర్ణయం వెలబడితే దాదాపు డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతంకు పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా జీతం కూడా భారీగా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో మార్చిలో ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు వరుసగా 4 శాతం DAతో పాటు DR పెంచుతూ వచ్చినట్లు తెలస్తోంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం మరో సారీ భారీగా డీఏ పెంచనుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో రెండు సార్లు డీఏ నుంచి పెంచుతుంది. మొదటి DA జనవరి 1 తేదిన ప్రభుత్వం ప్రకటించగా.. రెండవది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో సరుకుల ధరలు ఖరీదు కావడంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుబోతున్నట్లు తెలుస్తోంది. ఈ డీఏ పెరిగితే గవర్నమెంట్ ఉద్యోగులకు కాస్త ఉపశమనం లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ డియర్‌నెస్ అలవెన్స్‌పై కీలక ప్రకటన చేస్తే బేసిక్ సాలరీ రూ.18 వేల కాగా.. ఈ DA పెరిగితే దాదాపు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అక్టోబర్ నెలలో DA పెరిగితే ఉద్యోగులకు పండగ సీజన్‌లో పెద్ద వరంగా మారబోతోంది. అయితే కొంత మంది నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 24 గంటల్లో జీతల పెంపుపై కేంద్ర ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయట.
ఇప్పటికే ఈ DA గురించి కేంద్ర నిపుణులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఎనిమిదవ వేతన సంఘంపై కూడా చర్చులు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రం కోటీ ఉద్యోగులకు సంబంధించిన DA పెంపు కీలక నిర్ణయాన్ని బుధవారం లోగ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.