8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు
ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం అమలు అవుతున్న 7వ వేతన సంఘాన్ని 2013లో ఏర్పాటు చేసింది.
ఇందుకు సంబంధించిన సిఫార్సులు 2016 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ లెక్కన జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత 10 సంవత్సరాల ప్రాతిపదికన తీసుకుంటే.. కొత్త పే కమిషన్‌పై నిర్ణయం తీసుకోవచ్చు.
7వ వేతన సంఘం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా 2.57 రెట్లు జీతం పెరిగి.. 14.29 శాతానికి, బేసిక్ వేతనం రూ.18 వేలకు పెరిగింది.
8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతం 44.44 శాతం పెరుగుతుంది. అంతేకాకుండా బేసిక్ పే రూ.26 వేలకు చేరుకుంటుంది.
కొత్త పే కమిషన్‌పై ప్రకటన వస్తే.. జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.