8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్ లాటరీ.. జీతం ఏకంగా రూ.35,600 పెంపు..?.. పండగ వేళ శుభవార్త చెప్పిన మోదీ..

Sat, 05 Oct 2024-10:52 pm,

ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏ పెంపుపై ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నిత్యవసరాల ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. అంతేకాకుండా.. ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగిపోయింది.  

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు 7 వ వేతన సవరణ డీఏ పెంపుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనిపై అనేక విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరికి డీఏ పెంపుతో 50 శాతం వరకు పెంపు చేరుకుంది. ఇప్పుడు మరల 3 నుంచి 4 శాతం వరకు డీఏ పెంపుదల ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

కేంద్రం ప్రతి ఏడాది రెండు మార్లు డీఏ పెంపుదల చేస్తుంది. జనవరి, జులై మాసంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఉంటుంది. ఒక వేళ ఆలస్యమైన కూడా ఈ నెలను బేస్ గా తీసుకుంటారు.ఈ నేపథ్యంలో.. దసరా వేళ 7వ  వేతన సంఘం నిధులు పడొచ్చని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి.  డీఏ ఏకంగా 53 శాతానికి కూడా చేరుకునేందుకు అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది. 

ఈ నేపథ్యంలో.. మోదీ సర్కారు 8 వ వేతన సవరణ సంఘం మీద కూడా కీలక అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వేతనాన్ని 20% నుండి 35% వరకు పెంచవచ్చని తెలుస్తోంది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనాన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం కనీసం రూ.26,000 ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. గత బడ్జెట్ సెషన్‌లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది. కానీ..  ప్రభుత్వం దానిపై ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు, దీపావళి శుభ సందర్భంగా, ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణించవచ్చని తెలుస్తోంది. ఇది ఉద్యోగులకు గొప్ప ఉపశమనం కలిగించవచ్చు.  

బేసీక్ పే ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరుగుదల 20% నుండి 35% మధ్య ఉండవచ్చు. ఈ పెంపు అమలైతే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ఉదాహరణకు, లెవల్ 1 ఉద్యోగుల జీతం ప్రస్తుతం రూ.28,000 ఉంటే, అది దాదాపు రూ.35,600కి పెరగవచ్చు. అదేవిధంగా, లెవల్ 18 ఉద్యోగుల జీతం రూ.4.8 లక్షలకు చేరుకుంటుంది. 

భారతదేశంలో ఇప్పటి వరకు 7 పే కమిషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో మొదటి పే కమిషన్ 1946లో స్థాపించబడింది. అత్యంత ఇటీవలి, అంటే 7వ వేతన సంఘం, ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటైంది. 2015న తన నివేదికను సమర్పించింది.   

ఈ నేపథ్యంలో.. ఏడవ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని సిఫారసుల మేరకు.. కేంద్రం ఉద్యోగులకు డీఏ 4శాతం పెంచడంతో.. 50 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. 

ఇప్పుడు 8వ వేతన సంఘంపై చర్చలు ప్రారంభమై దాని ఫైళ్లు సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త వేతన సంఘం దాదాపు 1.12 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. 8వ వేతన సంఘం ఏర్పాటు ద్వారా వివిధ సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతం, ఇతర సౌకర్యాలపై సమీక్షించనున్నారు. 

దీపావళికి ముందే జీతాలు పెరిగే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. 8వ వేతన సంఘం ఏర్పాటు, జీతాలు పెరిగడటంపై భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ నేపథ్యంలో మోదీ సర్కారు కానుక కోసం.. ఉద్యోగులంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలను Zee Mediaధృవీకరించలేదు)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link