8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్, 8వ వేతన సంఘంపై ప్రకటన, డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కనీస వేతనం 9000 ఉంటే పెన్షన్ 270 రూపాయలు, 1,25,000 పెన్షన్ ఉంటే 3,750 రూపాయలు పెన్షన్ పెరుగుతుంది.
జనవరి 2025 డీఏ పెంపు 3 శాతం ఉంటే మొత్తం డీఏ 56 శాతానికి చేరుతుంది. కనీస వేతనం 18 వేలుంటే నెలకు 540రూపాయలు పెరగనుంది. గరిష్ట జీతం 2.50 లక్షలుంటే 7,500 జీతం పెరుగుతుంది.
ఇక కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మూడవ గుడ్‌న్యూస్ జనవరి 2025 డీఏ ప్రకటన. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి కూడా డీఏ 3 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే మొత్తం డీఏ 56 శాతం పెరగవచ్చు.
ఇక లెవెల్ 14 ఉద్యోగులకు కనిష్టంగా 1,82,200 రూపాయల నుంచి గరిష్టంగా 2,24,100 రూపాయల వరకూ లభిస్తాయి.
డీఏ బకాయిల ద్వారా ఎంత లభిస్తుందనేది ఉద్యోగుల జీతం, గ్రేడ్ పే ఆధారంగా ఉంటుంది. లెవెల్ 1 ఉద్యోగులకు 11,800 రూపాయల నుంచి గరిష్టంగా 37,554 రూపాయలు పొందవచ్చు.లెవెల్ 13 ఉద్యోగులకు 1,44,200 రూపాయల నుంచి 2,18,200 వరకూ లభిస్తుంది
రెండవ గుడ్‌న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పట్నించో ఎదురుచూస్తున్న 18 నెలల పెండింగ్ డీఏ. కరోనా మహమ్మారి సమయంలో 18 నెలల డీఏ నిలిచిపోయింది. ఈ పెండింగ్ డీఏపై కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన ఉండవచ్చని అంచనా.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు బక్రియోట్ ఫార్ములా ఉపయోగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగవచ్చు.
ప్రైవేట్ ఉద్యోగులకు ప్రతి యేటా అప్రైజల్ విధానం అంటే పనితీరుని బట్టి వేతనం పెంపు ఉంటుంది. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అమలు చేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లోనే దీనిపై స్పష్టత రానుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గత కొద్దికాలంగా 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు. వేతన సంఘాన్ని తొలగించి అప్రైజర్ విధానం ప్రవేశపెట్టవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.