Name Astrology: `A` అక్షరం పేరున్నవారు ఎలాంటివారో తెలుసా? వారిలో ఉన్న మైనస్‌ ఇదే..!

Sat, 26 Oct 2024-9:49 am,

'A' అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగా ఓపిక ఎక్కువ కలిగి ఉంటారు. ఏదైనా పనికి పూనుకుంటే వాటి ఫలితాల కోసం కూడా చాలా ఓపిగ్గా ఎదురు చూస్తారు.  

వీళ్లు చాలా సరదాగా ఉంటారు. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా ఆస్వాదించాలో తెలుసు. వీరి జీవితంతో రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడతారు.  

ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మంచి భోజనప్రియులు, తరచూ ట్రావెల్‌ చేయడానికి ఇష్టపడతారు. అంతేకాదు వీరు సంప్రదాయాలు కూడా పాటిస్తారు.  

'A' అక్షరంతో పేరు ప్రారంభయ్యే వ్యక్తులు ఏ రంగం ఎంచుకున్నా అగ్రస్థానంలో ఉండటానికే ఇష్టపడతారు. నంబర్ వన్ స్థాయిలో రాణిస్తారు.  

ఈ వ్యక్తులు ఎక్కువ శాతం ఇతరులకు ధైర్యంగా కనిపించడానికి ఇష్టపడతారు. వీరు బాధలను బయటకు కనిపించకుండా లోపలే దాచుకుంటారు.  

క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒంటరిగా సాధిస్తారు. స్వీయ ఆధారిత వ్యక్తులు, సొంత కష్టం మీద బతుకుతారు కాబట్టి వీరికి విజయాలు ఎక్కువ.  

వీరిలో ఉన్న గొప్పదనం ఏంటంటే వైఫల్యాలు ఎదురైనా నిరుత్సాహం చెందకుండా మళ్లీ ప్రయత్నిస్తారు. వారి భవిష్యత్తుపై ఓ అంచనా కలిగి ఉంటారు.  

అన్నిట్లో మొదట ఉండటానికి ప్రయత్నిస్తారు. సొంత ఆలోచనాల ప్రకారం నడుచుకుంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.  

'A' అక్షరంవారు ఎక్కువ శాతం వ్యవసాయం, టెక్నాలజీ, ప్రొఫెషనల్‌ రంగంలో రాణిస్తారు. అయితే, వీరిలో ఉండే మైనస్‌ ఏంటంటే ఇతరులను తక్కువగా అంచనా వేస్తారు. వారిని ఎక్కువగా ఊహించుకుని ఇతరులను తక్కువ అంచనా వేస్తారు.(గమనిక: కేవలం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం మేరకు రాసిన ఆర్టికల్‌ మాత్రమే దీనికి జీ తెలుగు బాధ్యత వహించదు)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link