Samantha: సమంత చాలా క్రూరమైనది.. ఆమె నా మరదలు కాదు..నాగచైతన్యతో విడాకుల గురించి స్టార్ హీరో వ్యాఖ్యలు

Thu, 07 Nov 2024-4:55 pm,

నాగచైతన్య త్వరలోనే శోభిత అని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయం గురించి సమంత ఎలా స్పందిస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే సమంత ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. 

మరోపక్క నాగ చైతన్య, నాగార్జున తప్ప.. వారి కుటుంబానికి చెందిన హీరోలు అఖిల్, రానా లాంటివారు ఇప్పటికీ సమంతతో ఎంతో క్లోజ్ గానే ఉంటారు. సోషల్ మీడియాలో పుట్టినరోజులకు విషెస్ కూడా తెలుపుతూ ఉంటారు. 

ఈ క్రమంలో హీరో రానా సమంత… గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే.. ఈ మధ్యనే ఐఫా అవార్డ్స్ రంగ రంగ వైభవంగా జరగక.. ఈ ఈవెంట్ కి రానా యాంకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

ఈ ఈవెంట్లో రానా.. సమంత స్టేజ్ మీదకి వచ్చినప్పుడు.. ఆమె గురించి చెబుతూ.. ఈ హీరోయిన్ నాకు మరదలు నుంచి చెల్లెలు అయింది అని అన్నారు. అనగా నాగచైతన్యని పెళ్లి చేసుకున్నప్పుడు.. వరసకు సమంత రానాకి మరదలు. కానీ ఇప్పుడు విరాకులు తీసుకుంది కాబట్టి చెల్లెలు అయింది అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశారు.   

అంతేకాదు ఒకప్పుడు సమంత రుటు ప్రభుని.. తను సమంత రూట్ లెస్ ప్రభు అనేవారని గుర్తు చేసుకున్నారు. రూట్ లెస్ అంటే క్రూరమైన వాళ్ళు అని అర్థం. అయితే సమంత అప్పట్లో ఎంతో అల్లరిగా ఉండేదని.. అందుకే తను అలా అనే వాడినని ఇప్పుడు మాత్రం అల్లరి లేదు అంటు చెప్పుకొచ్చారు రానా. ఇక దీనికి సమంత సమాధానమిస్తూ.. పరిస్థితులు తనను మార్చాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link