Beauty Secrets : ఏడుపే నా అందానికి అతిపెద్ద సీక్రెట్.. బాలీవుడ్ బ్యూటీ కామెంట్స్ వైరల్..!
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన అందానికి సీక్రెట్ తన ఏడుపే అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. సాధారణంగా అందంగా కనిపించడానికి ఏవేవో ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. అయితే ఈమె మాత్రం అందం పెరగడానికి ప్రతి రోజు ఏడుస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
బాలీవుడ్ బ్యూటీగా మంచి పేరు సొంతం చేసుకున్న అనన్య పాండే.. చుంకీ పాండే కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె అందం వెనుక ఉన్న సీక్రెట్ తెలిపింది.
అనన్య మాట్లాడుతూ.. నాకు ఏడుపు అంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు నా సోషల్ మీడియాలో కూడా నేను ఏడ్చే ఫోటోలు పెడతాను.
కన్నీటితో నిండిన కళ్ళు నా సహజమైన అందాన్ని నా ముఖంలో మెరుపును తీసుకొస్తాయి. మామూలుగా ఉన్నప్పుడు కంటే నేను ఏడుస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తాను.
అంతేకాదు చాలా సార్లు ఏడుస్తూ అద్దంలో నన్ను నేను చూసుకుంటాను.. సాధారణంగా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేను. ఆటోమేటిగ్గా కన్నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఆ కన్నీళ్లే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి అంటూ తెలిపింది.
అంతేకాదు అందంగా కనిపించడానికి కావాలని ఏడుస్తానంటూ తెలిపింది అనన్య పాండే. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.