Anasuya: నా భర్త నా కోరిక తీర్చలేదు అంటూ బోరున ఏడ్చేస్తున్న అనసూయ.. ఏమైందంటే..?

Sat, 19 Oct 2024-8:43 am,

ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ.. ప్రముఖ కామెడీ షో  జబర్దస్త్ లోకి వచ్చి యాంకర్ గా మారి ఒక్కసారిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది.  

దాదాపు తొమ్మిదేళ్లుగా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగిన ఈమె, తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని గ్లామర్ తో మెప్పించింది. 

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో విలన్ గా నటిస్తూనే , లేడీ ఓరియంటెడ్ పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా తన భర్త భరద్వాజ్ తన కోరిక తీర్చలేదంటూ బోరున ఏడ్చేసింది. అనసూయ తన భర్తను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  వివాహమనంతరం ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన ఈమె , కూతురు కావాలంటూ పట్టు పట్టిందట.   

ముగ్గురు పిల్లల పెంపకం అంటే కష్టమవుతుందని భరద్వాజ్ ఆమె కోరిక నెరవేర్చడానికి ఇష్టం చూపలేదట.  అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలని,  ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో సమానమని,  ఆ సందడి ఇంకోలా ఉంటుంది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది అనసూయ. 

అయితే ఎన్నిసార్లు కూతుర్ని కణాలని ప్రయత్నించినా తన భర్త సహకరించడం లేదు అంటూ దుఃఖాన్ని వెళ్ళగక్కింది అనసూయ.   

ప్రస్తుతం అనసూయ బాధ చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూతురు కావాలి అంటూ కూతురి కోసం అనసూయ పడుతున్న తాపత్రయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link