Anupama Parameswaran: చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ.. పిచ్చెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్

Sun, 18 Dec 2022-9:57 pm,

మలయాళ 'ప్రేమమ్' సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా అక్కడ హిట్ కొట్టడంతో ఈ బ్యూటీకి తెలుగు ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇక రీసెంట్‌గా కార్తీకేయ-2 మూవీతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక నుంచి అదే జోను కంటిన్యూ చేయాలని చూస్తోంది.   

త్వరలో నిఖిల్‌ సిద్ధార్థ్ సరసన 18 పేజెస్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

అంతకుముందు డీజే-2 సినిమాలో కూడా అనపమనే హీరోయిన్‌గా అనుకున్నారు. కొద్ది రోజులు షూట్‌లో కూడా పాల్గొందట. అయితే అనివార్య కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది ఈ మలయాళ కుట్టీ.  

మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ అమ్మడు. క్యారీవ్యాన్‌లో చీరలో స్టిల్స్‌ ఇస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link