Hebah Patel: శారీలో అదరగొట్టిన హెబ్బా పటేల్.. అందం అదరహో
1989 జనవరి 6న ముంబైలో హెబ్బా పటేల్ జన్మించింది. బీఎంఎంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
2014లో వచ్చిన 'తిరుమనం ఎనుం నిఖా' మూవీ ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే కన్నడలో వచ్చిన అధ్యక్ష మూవీ ముందు రిలీజ్ అయింది.
2014లో వచ్చిన 'అలా ఎలా?' అనే మూవీ ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. 2015లో వచ్చిన 'కుమారి 21ఎఫ్'తో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ వచ్చింది.
ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో నటించింది. అయితే క్రేజ్ భారీగా సంపాదించుకున్నా.. స్టార్ హీరోయిన్‌గా మాత్ర పేరు తెచ్చుకోలేకపోయింది.
రెడ్ సినిమాలో హెబ్బా పటేల్ ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది. ఆ తరువాత ఈ బ్యూటీకి సినీ అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి. చివరగా 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమాలో హెబ్బా తన నటనతో ఆకట్టుకుంది.