Telugu Movie Gossips: కెరీర్ ఊపు మీద ఉన్నప్పుడే బిలినీయర్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆ వ్యాపారవేత్త ఆస్తి విలువ ఎంతో తెలుసా..!
జుహీ చావ్లా 90లలో స్టార్ హీరోయిన్గా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. మెరిసే కళ్లు, మనోహరమైన చిరునవ్వుతో అభిమానులను అలరించింది.
బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్, రిషి కపూర్, గోవిందా వంటి బడా హీరోలతో కలిసి సినిమాల్లో నటించింది.
జుహీ చావ్లా 1995లో తన కెరీర్ టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే ప్రముఖ వ్యాపారవేత్త జే మెహతాను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు జాహ్నవి, అర్జున్ ఉన్నారు.
జే మెహతాకు అప్పటికే వివాహం అవ్వగా.. మొదటి భార్య సుజాత బిర్లా ప్రమాదంలో మరణించింది. మల్టీ నేషనల్ కంపెనీ గ్రూప్ ‘ది మెహతా గ్రూప్’ సంస్థకు ఆయన వ్యవస్థాపకుడు. ఈ సంస్థకు ఆఫ్రికా, భారత్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ తదితర దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి.
‘ది మెహతా గ్రూప్’ కంపెనీ విలువ 500 మిలియన్ US డాలర్లు అంటే దాదాపు 4162 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 15 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
కేకేఆర్ టీమ్‌కు సహ యాజమని అయిన జే మోహతాకు సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ , గుజరాత్ సిద్ధి సిమెంట్ లిమిటెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి.