Kasturi Shankar: పరారీలో కస్తూరి శంకర్.. తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యల గురించేనా..?
నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న కస్తూరి శంకర్, ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు వరుస సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
ఇకపోతే ఇటీవల ఒక బహిరంగ సభలో పాల్గొన్న కస్తూరి శంకర్ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. గత మూడు వందల సంవత్సరాల క్రితం మహారాణులకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వలస వచ్చారు అంటూ చేసిన కామెంట్స్ తెలుగు ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసింది.
ముఖ్యంగా తమిళనాడులో ఉండే తెలుగు ప్రజలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు.
ఇకపోతే కేసు నమోదు అవ్వగా ఈమెను అరెస్టు చేయడానికి మద్రాస్ లోని ఆమె ఇంటికి పోలీసులు వెళితే, అక్కడ ఆమె తన ఇంటికి లాక్ చేసి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇకపోతే కేస్ ఫైల్ అవ్వకముందే ముందస్తు బెయిల్ కోరిన కస్తూరి శంకర్.. మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ఈరోజు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇకపోతే తాజాగా ఈమె పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు తాను తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదని, తన మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినా తెలుగు వారు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.