Meena Photoshoot : విషాదాన్ని మరిచిపోయే ప్రయత్నం.. వెకేషన్లో మీనా.. పిక్స్ వైరల్
టాలీవుడ్లో మీనాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 90వ దశకంలో మీనా సినిమాలే ఎక్కువగా వచ్చాయి.
చిరు, నాగ్, బాలయ్య, వెంకీలకు సరైన జోడిగా మీనా అద్భుతమైన సినిమాల్లో నటించింది. ఆ నలుగురు హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది.
మీనా సినిమాల నుంచి దూరంగా వెళ్లింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ వుమెన్‌గా మారింది. ఆమె కూతురిని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇప్పించింది.
మీనా భర్త గత ఏడాది అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఆయన మరణం తరువాత మీనా రెండో పెళ్లి మీద రకరకాల రూమర్లు వచ్చాయి.
మీనా ఇప్పుడు తన భర్త మరణించిన విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇలా వెకేషన్లో మెరిసింది.