Meena: స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి.. ఇంతకీ ఎవరంటే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన మీనా.. అనతి కాలంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి పలు చిత్రాలలో నటించిన ఈమె, ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోలు అందరి సరసన నటించిన మీనా.. కోలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ అందుకుంది.
వరుస సినిమాలు చేస్తూ కెరియర్ పీక్స్ లో ఉండగానే విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. నైనిక అనే పాప కూడా జన్మించింది. ఈ పాప ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలా అటు వ్యక్తిగతంగా ఇటు కెరియర్ పరంగా దూసుకుపోతున్న మీనాకు సడన్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్య కారణంగా తుది శ్వాస విడిచారు. దీంతో మీనా ఒంటరి అయిపోయింది.
ఈ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నా.. మీడియా మాత్రం ఈమెను వదలడం లేదు. రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేస్తూ ఈమెపై విమర్శలు గుప్పిస్తోంది. గత కొద్ది రోజులుగా అప్పటికే విడాకులు తీసుకొని సింగిల్ గా ఉన్న స్టార్ హీరోలతో మీనాను జతకడుతూ మీనా రెండో పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు గుప్పించారు.
అలాగే ధనుష్ తో కూడా మీనాకు ఎఫైర్ రూమర్స్ సృష్టించారు. ఇలా గత కొద్ది రోజులుగా రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై తాజాగా మీనా స్పందించింది. తన పెళ్లిపై రకరకాల వార్తలు రాస్తున్నారని, అవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు.
తమిళ స్టార్ హీరో ధనుష్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ కొందరు వార్తలు రాయగా.. ఆయన ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారని.. అందుకే మేమిద్దరం వివాహం చేసుకోబోతున్నాం అంటూ వార్తలు రాస్తున్నారని.. ఏదో ఒక విషయాన్ని హైలెట్స్ చేయాలి అనే ఉద్దేశంతో లేని పుకార్లను సృష్టించి హైలెట్ అవడం నిజంగా బాధాకరం.. ముఖ్యంగా మీకు వ్యూస్ రావడానికి, డబ్బు సంపాదించడానికి సెలబ్రిటీలను ఎరగా వేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారంటూ మండిపడింది మీనా.