Mrunal Thakur: రెడ్ కలర్ లెహాంగాలో హోయలు పోతున్న మృణాల్ ఠాకూర్.. చూస్తే తట్టుకోలేరు..
సీతారామం ఫెమ్ మృణాల్ ఠాకూర్ సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే ఎంపికచేసుకుంటారు. ఆయా సినిమాలలోని పాత్రలకు అనుగుణంగా అప్పుడు ట్రెడిషనల్, ఆతర్వాత ట్రెండీగా కన్పిస్తుంటారు. ఇటీవల ఆమె ముంబై వేదికగా జరిగిన ఒక ఫ్యాషన్ షోలోపాల్గొన్నారు.
ఆ ఈవెంట్ లో నటి మృణాల్ ఠాకూర్ రెడ్ కలర్ లెహాంగా వేసుకుని అందరిని,తన స్టన్నింగ్స్ లుక్స్ , గ్లామర్ తో అబ్బురపరిచారు. ఆమె ర్యాంప్ వాక్ చేసుకుంటు వస్తున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి.
ముఖ్యంగా అందరి కళ్లు మృణాల్ ఠాకూర్ వేసుకున్న లెహాంగా మీద పడ్డాయంట. ఆ లెహాంగా రెడ్ కలర్ ఉండి, ముత్యాలు కూడా పొదిగి ఉండటం కన్పిస్తుంది. చూడటానికి ఎంతో గ్రాండ్ లుక్ ని కూడా ఇస్తుంది. ఈ లెహాంగాను తన డిజైనర్ అను రూపొందించారని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు.
రెడ్ కలర్ లెహాంగాను పూర్తిగా రెడీ చేయడానికి దాదాపు ఆమె 1400 గంటల సమయం తీసుకుందని కూడా తెలిపింది. తన లెహాంగా క్రెడిట్ పూర్తిగా తన డిజైనర్ అనుకే అని మృణాల్ ఠాకూర్ చెప్పారు.
ఇదిలా ఉండగా.. జెర్సీ, సూపర్ 30 సినిమాలతో ఫెమస్ అయిన మృణాల్ ఠాకూర్ సీతారామంతో ఒక రేంజ్ లో ఫెమ్ తెచ్చుకున్నారు. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూవీలలో నటించారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పూజా మేరీ జాన్ హిందీ మూవీలో షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు.