Ridhima pandit: అంతా మీ ఇష్టమేనా.. పెళ్లి వదంతులపై తీవ్ర అసహానం వ్యక్తం చేసిన నటి..
టీవీ నటి రిధిమా పండిత్ ఇటీవల సొషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ లో నిలిచారు. ఆమె తన పెళ్లి గురించి ఎంతో సీక్రెట్ మెంటెన్ చేస్తున్నారని, క్రికెటర్ శుభ్ మన్ గిల్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో విపరీంగా ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆమెకు ఎంతో మంది ఫోన్ లు చేసి దీని గురించి ఆరాతీసినట్లు తెలుస్తోంది. స్నేహితులు, బంధువులు కూడా దీనిపై రిధిమాను ప్రశ్నించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎట్టకేలకు ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.
తన పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని ఆమె కొట్టిపారేశారు. అసలు తనకు శుభ్ మన్ గిల్ ఎవరో కూడా తెలీదని అన్నారు. ఇక డేటీంగ్ చేయడం అని వదంతులు ఆపాదించడం ఏంటని ఆమె ఫైర్ అయ్యారు.
కొందరు కావాలని అసత్య కథనాలు అల్లుతున్నారని, ఇలాంటి పనులు మానుకొవాలని చురకలు పెట్టారు. కొంత మంది మీడియా వాళ్లుతనకు ఫోన్ లు చేసి విసిగు తెప్పించేలా మాట్లాడుతున్నారని రిదిమా పండిత్ తీవ్ర అసహానం వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని రిధిమా తెల్చి చెప్పారు. ఇదిలా ఉండగా.. రిధిమా.. బహు హమారీ రజనీకాంత్ తో టీవీ షోలో నటించారు. ఖత్రోస్ కీ ఖిలాడీ, బిగ్ బాస్ ఓటీటీ తదితర రియాలీటీ షోలలో నటించారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా టీమ్ ఇండియా యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ పై ఇలాంటి వదంతులు రావడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటి వరకు శుభ్ మన్ గిల్ స్పందిచలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల జాన్వీకపూర్ కూడా తొందరలోనే పెళ్లిజరుగుతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపైనర జాన్వీకపూర్ తీవ్రంగా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.