Samantha: గడ్డుకాలంలో అమ్మవారినే నమ్ముకున్న సమంత.. దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు
దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రులు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో సినీ నటి సమంత రూత్‌ప్రభు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.
కుంకుమ రంగు దుస్తుల్లో మెరిసిన సమంత అత్యంత శక్తిశ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు.
ఈషా ఫౌండేషన్‌కు చెందిన లింగ భైరవి ఆలయాన్ని సమంత దర్శించుకున్నారు.
తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లో అగ్ర తారగా సమంత రాణిస్తున్న సమయంలో వైవాహిక జీవితంలో అలజడులు.. అనారోగ్యం నేపథ్యంలో ఆమె కొన్నాళ్లుగా ప్రేక్షకులకు దూరమయ్యారు.
అయితే వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు అనుభవం సమంతను వెంటాడుతూనే ఉంది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన విడాకుల అంశాన్ని రాజకీయ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.
నిస్సిగ్గుగా.. అసభ్యకర రీతిలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సమంత ఖండించారు.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అంశంలో సమంతను ఇరికించడం క్షమించరాని తప్పుగా సమంత పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వివాదమే సమంతను చుట్టుముట్టింది. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.