Tabu: 53 ఏళ్ల వయసులో పెళ్లిపై ఓపెన్ అయిన టబు..?.. అతడి వల్లే ఇదంతా అంటూ షాకింగ్ కామెంట్స్.!
నటి టబు 50 ఏళ్లు దాటిన కూడా ఇప్పటికి కూడా తన అందంతో కుర్రాకారును నిద్రలేకుండా చేస్తారని చెప్పుకొవచ్చు. ఆమె ఎప్పటికప్పుడు.. మూవీస్ లో కొత్త రోల్స్ చేస్తు.. దానిలో ఇమిడిపోతారని చెప్పుకొవచ్చు. అయితే.. నటి టబు తెలుగులో.. కూలీ నెం1 తొ ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత..బాలయ్య, నాగార్జున, వంటి స్టార్ హీరోల సరసన నటించారు. ప్రేమ దేశం సినిమాలో టబు నటనకు.. ఇప్పటికి కూడా కుర్రకారు ఫిదా అయిపోతుంటారు.
నిన్నే పెళ్లాడత, పాండు రంగడు, ఆవిడే మావీడే.. మొదలైన మూవీస్ టబుకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈక్రమంలో నటి టబు హిందిలో కూడా అనేక మూవీస్ చేశారు. ఈ క్రమంలో నటి టబు.. మాత్రం ఇప్పటికి కూడా పెళ్లిచేసుకోలేదు.
ఆమె అజయ్ దేవ్ గణ్ తో చాలా చనువుగా ఉండేవారంట.అతను.. తన సోదరుడు సమీర్ ఫ్రెండ్ కావడంతో... అప్పట్లో గ్యాంగ్ గా తిరిగి రచ్చ చేసేవారంట. వీరి భయానికి టబు జోలికి ఎవరు వెళ్లేవారు కాదంట.
కొన్నిరోజుల పాటు అజయ్ దేవ్ గణ్, టబుల మధ్యఎఫైర్ నడిచిందని కూడా చెప్తుంటారు. కానీ ఏంజరిగిందో కానీ.. అజయ్ దేవ్ గణ్ అనూహ్యంగా కాజల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
నటి టబు ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా.. మూవీ సమయంలో నాగార్జునతో కూడా డేటింగ్ చేశారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఏకంగా నాగార్జున.. టబు కోసం హైదరాబాద్ లో ఒక ఇల్లు కూడా కొనిచ్చారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.
టబు, నాగార్జున తరచుగా కలుసుకునే వారంట. నాగార్జున పెళ్లి తర్వాత కూడా ఇద్దరు కలుసుకున్నారని వార్తలు విన్పిస్తుంటాయి. కానీ ఇదంతా ఫెక్ అని కొందరు కొట్టిపారేస్తుంటారు.
ఈ నేపథ్యంలో నటి టబు.. తనకు 50 ఏళ్లు దాటిన కూడా పెళ్లికానందుకు.. అప్పట్లో అజయ్ దేవ్ గణ్, తన సోదరుడికి భయపడి ఎవరు తన జోలికి వచ్చేవారని కాదని.. ఎంతో మంది దూరంనుంచి సైట్ కొట్టేవారని టబు చెప్పిందంట. అందుకే తన జీవితం ఇప్పటికి కూడా పెళ్లికి నోచుకోలేదనికూడా టబు అన్నారంట. దీనిలో ఎంత నిజముందో కానీ.. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.