Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లికి ఓకే చెప్పిన నాగార్జున మాజీ ప్రేయసీ..?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?
బాలీవుడ్ నటి టబు ఐదు పదుల వయస్సు దాటిన కూడా ఇప్పటికి కూడా ఎంతో హాట్ గా ఉంటుందని చెప్పుకొవచ్చు. ఈ నటి అంటే ఇప్పటికి కూడా యూత్ అంతా పడిచస్తారు. సీనియర్ నటి టబుకి చిన్న తనంనుంచి సినిమాలు అంటే తెగ ఇంట్రెస్ట్ అంట. అందుకే ఆమె బాలనటిగా సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా తెలుగులో కూలీనెం 1 సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన నటించే చాన్స్ కొట్టేశారు. తెలుగులో ఈ మూవీ టబుకు తొలిసినిమా.
ఆ తర్వాత టబు వెనక్కు తిరిగి చూసుకొకుండా.. తన నటనతో అందరికి మెస్మరైజ్ చేసినట్లు తెలుస్తొంది.ఆ తర్వాత వరుసగా.. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మావిడే వంటి సినిమాలలో అక్కినేని నాగార్జునకు జోడిగా నటించారు. ఈ మూవీ తర్వాత ఇద్దరి మధ్య మంచి చనువు ఏర్పడిందని కూడా గతంలో వార్తలు వచ్చాయి.
నాగార్జున , టబుల మధ్య సీక్రెట్ ఎఫైర్ నడించిందని, టబు నాగార్జునను పెళ్లి కూడా చేసుకొవాలని భావించిందంట. కానీ అనివార్య కారణాల వల్ల నాగార్జునతో పెళ్లి జరగలేదంట. కానీ వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ కూడా.. గతంలో అనేక రూమర్స్ వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా.. టబు బాలయ్య బాబుతో కూడా చెన్నకేశవ రెడ్డి, పాండు రంగడు వంటి మూవీస్ లో నటించారు. ఇటీవల అల వైకుంఠపురంలో కూడా నటించారు. ఈమూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో నటించారు.
అదే విధంగా అనేక హింది సినిమాల్లో కూడా టబు నటించారు. దృశ్యం 2, ఏ సూటబుల్ బాయ్, భూల్ భూలయ్యా, కుత్తే, భోళా, ఖుఫియా, దిక్రూ వంటి పలు సినిమాల్లో నటించారు. అంతే కాకుండా.. టబు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని తెలుస్తొంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రొమాన్స్ సీన్స్ పై టబు బోల్డ్ గా మాట్లాడారు. సినిమాలో కొన్ని సీన్ లు రొమాంటిక్ యాంగిల్ లో తీయాల్సి వస్తే.. దానికి సిద్దమే అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. రొమాన్స్ కు వయస్సుతో సంబంధంలేదని, సినిమాలోని పాత్రలో అలా చేసేందుకు కూడా రెడీ అన్నట్లు మాట్లాడారు.
ఈ క్రమంలో బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ లేడీ బ్యాచీలర్ గా టబును చెప్పుకొవచ్చు. ఈ సీనియర్ నటి 52 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా పెళ్లి చేసుకొలేదు. అయితే.. గతంలో నాగార్జున, హిందిలో అజయ్ దేవ్ గణ్ లతో లవ్ ఎఫైర్ లు నడిపిందని కూడా అప్పట్లో వార్తలు జోరుగా వచ్చాయి.
అయితే.. నటి టబు 52 ఏళ్ల వయస్సులో ఇప్పుడు పెళ్లి చేసుకొనేందుకు సిద్దమైనట్లు వార్తలు మాత్రం బాలీవుడ్ లో రచ్చగా మారాయి. అంతే కాకుండా.. ఒక బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారని, ఆయన ఆమె కంటే వయస్సులో చిన్నొడని, తొందరలోనే వీరు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేనట్లు తెలుస్తొంది.
అయితే... నటి టబు తాను హైదరాబాదీ అని తరచుగా చెప్తుంటారు. ఆమె హైదరాబాద్ లో సెంట్ ఆన్స్ హైస్కూల్ లో చదువుకున్నానని, ఇక్కడ ఆమెకు అనేక ప్రాపర్టీలు సైతం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టబు పెళ్లి వార్తలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకొవచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించినట్లు సమాచారం. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)