Trisha: నాలుగు పదుల వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న త్రిష.. వరుడు ఎవరంటే?
తరుణ్ హీరోగా వచ్చిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ త్రిష. అప్పటికే తమిళంలో కొన్ని సినిమాలలో నటించి.. తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది.
కాగా మొదట సినిమా నీ మనసు నాకు తెలుసు పరాజయం చవిచూసిన.. ప్రభాస్ తో చేసిన వర్షం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది ఈ హీరోయిన్. ఇక వర్షం చిత్రం తరువాత త్రిషకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరస సినిమాలు చేసుకుంటూ ఇటు తెలుగులో, అటు తమిళంలో దూసుకుపోయింది.
అయితే కొద్ది సంవత్సరాలు మాత్రం త్రిష సినిమా చాన్సులు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు అలానే.. లో బడ్జెట్ సినిమాలలో కూడా నటిస్తూ వచ్చింది. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోనీయన్ సెల్వన్ సినిమా.. మరోసారి త్రిష కు మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఇక ఆ సినిమా తరువాత వరుసగా తమిళంలో అగ్ర హీరోలతో నటిస్తూ.. మరోసారి రెమ్యూనరేషన్ పరంగా కూడా దూసుకుపోతోంది.
కాగా త్రిష కి కొద్ది సంవత్సరాల క్రితమే.. వరుణ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. మే 2015లో.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించింది త్రిష. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరికీ పెళ్లి కాకుండానే బ్రేకప్ అయ్యింది.
ఇక ఆ తరువాత నుంచి సినిమాలు చేసుకుంటూ.. కొనసాగింది ఈ హీరోయిన్. ఇక ఆ తర్వాత ఎప్పుడు త్రిష పెళ్లి గురించి ఎటువంటి వార్తలు రాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లి గురించి ఒక వార్త తెగ వినిపిస్తోంది.
త్రిష త్వరలోనే.. పెళ్లి పీటలు ఎక్కబోతున్నది అని సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారమవుతోంది. అంతేకాదు వరుడు తమిళనాడులో బాగా పేరుగాంచిన బిజినెస్ మాన్ అని.. వినికిడి. అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాలి అంటే.. త్రిష అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.