Adah Sharma: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో ఏదో శక్తి ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ది కేరళ స్టోరీస్ భామ..
బాలీవుడ్ నటి అదాశర్మ ప్రస్తుతం వరుస హిట్ లతో ముందుకు దూసుకుని వెళ్తున్నారు. అయితే.. కేరళ స్టోరీస్, బస్తర్ మూవీలతో ఆమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ లను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఆమె ముంబైలోని ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు.
ముంబైలోని ఒక ఇంట్లో బాలీవుడ్ భామ అదాశర్మ రీసెంట్ గా తన ఫ్యామిలీతో కలిసి మారిపోయారు. దీంతో అక్కడ ఆమెకు మొదట్లో బాగానే అన్పించిన కూడా ఆ తర్వాత ఏదో వెరైటీగా అన్పించిందంట..
తాజాగా, నటి ఒక ఇంటర్వ్యూలో తనకు కల్గిన అనుభవాన్ని పంచుకున్నారంట. ఇటీవలే కొన్నిరోజుల క్రితం.. అదాశర్మ.. ముంబైలోని ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంట్లో చేరడానికి ముందు, ఆ తర్వాత వీరి ఇంట్లో అనుకోని సంఘటనలు జరిగినట్లు తెలుస్తొంది. దీని వల్ల కొంత టెన్షన్ లకు గురైనట్లు నటి తాజాగా వెల్లడించింది.
అయితే.. సదరు నటి మాత్రం ఆ ఇంట్లో ఏదో శక్తి ఉందని కూడా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. తమ లైఫ్ లో కూడా కొన్ని అనుకొని సంఘటనలు జరిగాయని కూడా మాట్లాడింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
ఇదిలా ఉండగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మాత్రం ఇప్పటికి కూడా పెద్ద మిస్టరీగానే ఉందని చెప్పుకొవచ్చు.. అయితే.. ఆయన సినిమాల్లో మొదట మంచి అవకాశాలు వచ్చిన కూడా ఆ తర్వాత సరైన గుర్తింపులేక తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యారంట.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 2020 జున్ 14 న సూసైడ్ చేసుకున్నారు. ఆయనను ఎవరో కావాలని హత్య చేశారని కూడా ఆయన తండ్రి ఆరోపించారు. మరోవైపు ఆయన మరణానికి అతని ప్రియురాలు రియా చక్రవర్తి కూడా కారణమంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇప్పటికి కూడా సుశాంత్ సింగ్ మరణంపై మాత్రం మిస్టరీ కొనసాగుతునే ఉంది. దీనిపై అనేక రూమర్స్ ప్రస్తుతం వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో.. తెలుగులో.. అదా శర్మ తెలుగులో సీ.డీ. క్రిమినల్ ఆర్ డెవిల్ అని మూవీలో నటించింది.