Aditi Rao Hydari: సిద్ధార్థ్ గురించి ఎమోషనల్ అయిన హీరోయిన్.. ఎందుకంటే..?

Wed, 07 Aug 2024-3:22 pm,

బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అదితీ రావు హైదరి.. సౌత్ హీరో సిద్ధార్థ్ మధ్య.. చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తోంది. సౌత్ లో కూడా పలు సినిమాల్లో నటించిన అదితి రావ్.. ఎందుకో అంత పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. హిందీలో మాత్రం మంచి పేరే తెచ్చుకుంది ఈ హీరోయిన్. కాగా..సిద్ధార్థ తో ప్రేమ వ్యవహారం మొదలైనప్పటి నుంచి.. సౌత్ లో కూడా ఈమె పేరు మారుమ్రోగింది.  

త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు.. అని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో.. ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఇది జరిగిన కొద్ది రోజులకే.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టింది అదితి. తాజాగా అదితీ రావు సిద్ధార్థ్ గురించి పెట్టిన మరో సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

సిద్ధార్థ హీరోగా నటించిన చిన్న సినిమా.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ లో సిద్ధార్థ్ కి కూడా ఉత్తమ నటుడి అవార్డు అందింది. చిన్న సినిమా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఈ విషయం మీద అదితీ రావు సోషల్ మీడియాలో.. పోస్ట్ పెట్టింది. "ఈ గెలుపు నీకు మరింత శక్తిని ఇవ్వాలి.. అని కోరుకుంటున్నాను" అంటూ ఒక పెద్ద ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

అదితీరావు పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత బాలీవుడ్ లో తన హీరా మండి.. వెబ్ సిరీస్ సక్సెస్ ఈవెంట్లలో ఆమెతో పాటు సిద్ధార్థ కూడా కనిపించారు. ఇప్పుడు సిద్ధార్థ సక్సెస్ సందర్భంగా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మరోవైపు చిన్నా సినిమాకి ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటుడు క్రిటిక్స్ , ఉత్తమ సహాయ పాత్ర , ఉత్తమ నటి , ఉత్తమ సంగీత ఆల్బమ్ , ఉత్తమ నేపద్య గాయని ఇలా పలు విభాగాలలో ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. 

నిజానికి సిద్ధార్థ్ హీరోగా మారే సమయానికి అతని పెళ్లి అయిపోయింది. కానీ సిద్ధార్థ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూడా పలు హీరోయిన్లతో.. ప్రేమాయణం నడిపిన సిద్ధార్థ కొంతకాలంగా అదితి రావు హైదరి తో ఉన్నారు. ఇప్పటికే వీళ్ళ నిశ్చితార్థం అయిపోగా.. త్వరలోనే వెళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి తాలూకా డేట్ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link