IPO Market:ఐపీవోలో డబ్బులు పెట్టాలని ఉందా?గ్రే మార్కెట్లో దుమ్ము రేపుతున్న Afcom Holdings IPO వివరాలు మీకోసం.!!

Fri, 02 Aug 2024-3:02 pm,

Afcom Holdings IPO : మీరు ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలను కుంటున్నారా.. అయితే ఇది మీకు మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆఫ్ కామ్ హోల్డింగ్స్ ఐపీఓ (Afcom Holdings IPO) ప్రస్తుతం మార్కెట్లోకి ప్రవేశించింది. ఆఫ్ కామ్ హోల్డింగ్స్ ఐపీఓ (Afcom Holdings IPO) ప్రస్తుతం ఆగస్టు 2 నుంచి సబ్ స్క్రిప్షన్ కోసం తెరుచుకుంది. ఆగస్టు 6 వరకు ఇందులో బిడ్స్ దాఖలు చేయవచ్చు. ఈ ఐపీఓ ధరల విషయానికి వస్తే ఒక్కో షేరు ధర 108 రూపాయలుగా నిర్ణయించారు. మినిమం 1200 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు 1,29,600 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈ ఐపీఓ ద్వారా సుమారు 73.83 కోట్ల  సమీకరించాలని  సంస్థ నిర్ణయించుకుంది.   

ఈ కంపెనీ వ్యాపారం విషయానికి వస్తే Afcom హోల్డింగ్స్ లిమిటెడ్ (Afcom Holdings IPO) విమానాల ద్వారా కార్గో సేవలను అందిస్తోంది. అలాగే అంతర్జాతీయంగా పలు విమానాశ్రయాల్లో  తన వ్యాపారాన్ని కలిగి ఉంది. కంపెనీకి భారతదేశం, హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, చైనా,  తైవాన్‌లలో జనరల్ సేల్స్, సర్వీస్ ఏజెంట్లు (GSSAలు) ఉన్నారు. సింగపూర్, ఇండోనేషియా, బ్రూనైతో సహా  పలు ఆసియా  దేశాలపై దృష్టి సారించి కంపెనీ కార్గో విమానాలను నడుపుతోంది.  

కంపెనీ కార్గో సేల్స్, సర్వీస్ బిజినెస్‌లో గ్లోబల్ లీడర్ అయిన  ఎయిర్ లాజిస్టిక్స్ గ్రూప్‌తో కంపెనీ 24 సెప్టెంబర్ 2021న ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఎయిర్ లాజిస్టిక్స్ గ్రూప్ పలు దేశాలలో కంపెనీ జనరల్ సేల్స్ అండ్ సర్వీస్ ఏజెంట్ (GSSA)గా వ్యవహరిస్తుంది. అదనంగా, 13 అక్టోబర్ 2022న, భారతదేశంలో GSSAగా పనిచేయడానికి TTK గ్రూప్‌లో భాగమైన టేలర్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కంపెనీ అంగీకరించింది.

ఫిబ్రవరి 29, 2024 నాటికి, కంపెనీలో 21 మంది సిబ్బందితో సహా 47 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 10 మంది కెప్టెన్లు, 6 మంది ఫస్ట్ ఆఫీసర్లు, 3 ట్రాన్సిషన్ కెప్టెన్లు, 2 ట్రైనీ ఫస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. 

గ్రే మార్కెట్లలో బూమ్: ఈ ఐపీవోకు గ్రే మార్కెట్‌లో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆఫ్ కామ్ హోల్డింగ్స్ (Afcom Holdings IPO)  షేర్లు బంపర్ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. శుక్రవారం ఉదయం, షేరు ఇష్యూ ధర రూ.108కు గానూ  రూ.115 ప్రీమియంతో ట్రేడవుతోంది. కంపెనీ షేర్లు లిస్టింగ్ రోజు 106.48 శాతం ప్రీమియంతో రూ.223 వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link