Rohith Sharma: కంగారులా గడ్డపై షాక్‌..అశ్విన్‌ తర్వాత రోహిత్‌ శర్మనే రిటైర్‌మెంట్‌!

Wed, 18 Dec 2024-3:35 pm,

నాడు హైడ్రామా: 2014లో ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న పరిణామాలు తాజాగా పునరావృతమవుతున్నాయి. భారత జట్టులోని కీలక ఆటగాళ్లు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారని చర్చ జరుగుతోంది.

అశ్విన్‌ గుడ్‌బై: ఇలా చర్చ జరుగుతున్న క్రమంలోనే సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రికెట్‌కు బై బై చెప్పేశాడు. ఇక తర్వాత రోహిత్‌ శర్మనే చర్చ నడుస్తోంది.

వరుసగా ఫెయిల్యూర్స్‌: కెప్టెన్‌గా వరుసగా 5 టెస్టుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన రోహిత్ శర్మ ప్రస్తుతం కష్టాలు ఎదుర్కొంటున్నాడు. మహేంద్ర సింగ్‌ ధోని మాదిరి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా బోర్డర్-గవాస్కర్ సిరీస్ మధ్యలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి రాజీనామా ప్రకటించవచ్చనే వార్తలు వస్తున్నాయి.

ధోనీ అకస్మాత్తుగా: తన వ్యూహం ఫలించనప్పుడు కెప్టెన్‌గా కొనసాగడంలో అర్థం లేదని 2014 ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా తన సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. అంతేకాకుండా టెస్ట్‌ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు.

ఓటమిపై విమర్శలు: ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఓటమి పాలైంది. పెర్త్ వేదికగా జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఆడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఓటమి తర్వాత రోహిత్ కెప్టెన్సీపై సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రతి టెస్టు ఓటమికి రోహిత్‌పైనే విమర్శలు వస్తున్నాయి.

చెత్త రికార్డు: వరుసగా 4 టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 1967-68లో కెప్టెన్‌గా వరుసగా 6 టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు ఉంది.

కెప్టెన్లు ఫెయిల్యూర్స్‌: టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్‌గా విఫలమైన జాబితాలో సచిన్ టెండూల్కర్ 2వ స్థానంలో ఉన్నాడు. 1999-2000లో భారత కెప్టెన్‌గా సచిన్ వరుసగా ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. దత్తా గైక్వాడ్ (1959), ఎంఎస్ ధోని (2011 మరియు 2014), విరాట్ కోహ్లీ (2020-21), రోహిత్ శర్మ (2024) వరుసగా 4 ఓటములతో మూడో స్థానంలో నిలిచారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link