Aghori: అఘోరీలను విచారణకు పిలవకూడదు.. హరిద్వార్ నుంచి జీ తెలుగుతో నాగసాధు.. ఏమన్నారంటే..?
తెలంగాణలో ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంను ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ ఘటన తెలంగాణలో ప్రస్తుతం రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై హిందు సంఘాలన్ని కూడా భగ్గుమన్నాయి. అంతే కాకుండా..ఇటీవల సికింద్రాబాద్ లో కూడా బంద్ ను సైతం పిలుపునిచ్చారు. ఈ బంద్ కాస్త రచ్చగా మారిన విషయం తెలిసిందే.
ఇటీవల కాశీ నుంచి వచ్చి లేడీ అఘోరీ మాత తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అంతే కాకుండా, ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి పూజలు చేశారు. కొముర వెల్లి మల్లన్న, వేముల వాడకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడారు. కొంతమంది మాత్రం లేడీ అఘోరీ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించడం, కారును వాడటం పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా..ఆమె అసలు అఘోరీ కాదని కూడా ట్రోల్స్ సైతం చేశారు. దీనిపై అఘోరీ స్పందించారు. తాను ఏడేళ్ల ప్రాయంలో అఘోరీలా మారినట్లు తెలిపారు. స్మశానంలో ఇప్పటి వరకు వెయ్యికి పైగా శవాలను తిన్నట్లు తెలిపారు. లేడీ అఘోరీపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో లేడీ అఘోరీ హరిద్వార్ నుంచి జీ తెలుగుతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. అఘోరీలను విచారణకు పిల్వకూడదన్నారు. అంతే కాకుండా..తన గురువు విశ్వనాథ్ శాస్త్రిలను కలిశామన్నారు. ఆయన లోక కళ్యాణం, సనాతన ధర్మం కోసం ముందుకు వెళ్లమన్నారన్నారు.
అంతకు ముందు గుజరాత్ లో ఒక ఆలయంలో విగ్రహా ప్రతిష్టాపనకు వెళ్లేందుకు అఘోరీ వెళ్లగా.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హరిద్వార్ కు రమ్మన్నరంట. గురువుగారి ఆదేశం మేరకు.. లేడీ అఘోరీగా హరిద్వార్ కు వెళ్లారు.
హైదరాబాద్ లో ఇటీవల జరిగిన సంఘటనలు వివరించినట్లు తెలుస్తోంది. మన సంకల్పం ప్రకారం ముందుకు వెళ్లమని అఘోరీ గురువుగారు చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా... ఇక మీదట మీడియాలకు దూరంగా ఉంటానని కూడా లేడీ అఘోరీ చెప్పినట్లు సమాచారం.