Air India 50 Percent Discount: ఎయిరిండియా శుభవార్త.. వారి టికెట్లపై 50శాతం డిస్కౌంట్
Air India offers 50 Percent discount for senior citizens : విమానయానంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా (Air India) బెస్ట్ అని చెప్పవచ్చు. కరోనా వైరస్ సమయంలో లాక్‌డౌన్ విధించడంతో విమానరంగ సంస్థలు నష్టాన్ని చవిచూశాయి. కొన్ని సంస్థలైతే దాదాపుగా సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించాయని తెలిసిందే. అయితే ఎయిరిండియా అంటే నమ్మకం, విశ్వాసం ప్రయాణికులతో పాటు ఉద్యోగులకు ఉన్నాయి.
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) శుభవార్త అందించింది. సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. వృద్ధులకు విమాన టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
60 ఏళ్లు దాటిన వారికి విమానయానం సులభతరం చేసేందుకు వినూత్నంగా ఆలోచించింది ఎయిరిండియా. దేశీయ విమాన ప్రయాణంలో టికెట్ ధరలో కేవలం 50శాతం ధర చెల్లించి హాయిగా ప్రయాణించవచ్చునని ఈ ఆఫర్ ప్రకటించింది.
అయితే ఓ చిన్న కండీషన్ పెట్టింది. భారత పౌరుడై ఉండి, దేశంలో స్థిర నివాసం ఉన్నట్లుగా ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదైనా ఒక ఐడీ కార్డు, వయసు సంబంధిత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రయణ తేదీ నాటికి 60 లేక అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి తమ తాజా స్కీమ్ వర్తిస్తుందని ఎయిరిండియా స్పష్టం చేసింది.
Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!
ఎకానమీ క్లాసులో ప్రయాణించే వృద్ధులు ఎయిర్ ఇండియా 50శాతం డిస్కౌంట్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రయాణానికి మూడు రోజుల ముందు టికెట్లను కొనుగోలు చేస్తే సరి. చెక్ ఇన్ సమయంలో, ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ బోర్డింగ్ సమయంలో ఈ కేటగిరీ ప్రయాణికులు తమ డాక్యుమెంట్లను చూపించేందుకు వెంట తెచ్చుకోవాలి.
Also Read: Yearender 2020: భారత్‌లో ఈ ఏడాది చైనాయేతర మొబైల్స్ హవా