Akkineni Vs Congress: కాంగ్రెస్ కు అక్కినేని ఫ్యామీలీనే ఎందుకు టార్గెట్.. ?
Akkineni Vs Congress: తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్న ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ స్థాపించినా.. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు దేశం పార్టీకి మద్ధతు ఇవ్వలేదు. మరోవైపు ఏఎన్నాఆర్ కు కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి సత్సంబంధాలే మెయింటెన్ చేస్తూ వచ్చారు.
అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్.. అన్నపూర్ణ స్టూడియో స్థల వివాదం నేపథ్యంలో ఆ స్టూడియోకు సంబంధించిన గోడలను కూలగొట్టడం అప్పట్లో పెను సంచలనమే అయింది.
ఆ తర్వాత చాలా యేళ్లకు ఆయన ఫ్యామిలీకి ఒకప్పుడు దగ్గరగా ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఆయన తనయుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ ను చెరువులో అక్రమంగా నిర్మించారంటూ కూలగొట్టారు. ఓ రకంగా రేవంత్ సర్కార్ నాగ్ ను టార్గెట్ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి హీరో నాగార్జున ఫ్యామిలీయే ఎందుకు టార్గెట్ అయ్యింది…? మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత… నేడు సమంత నాగచైతన్య విడాకుల అంశంపై కాంగ్రెస్ రచ్చ చేయడానికి కారణమేంటి...? ఇదే చర్చ అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీని తప్ప మరెవరినీ టార్గెట్ చేసినట్లు కనిపించడం లేదు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలోనే కొందరికి మింగుడు పడడం లేదని సమాచారం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఎవరి హస్తం ఉందన్న చర్చ నడుస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ కు బడాక ఫ్యామిలీపై కక్ష సాధింపులు ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ పేల్చిన బాంబు టాలీవుడ్ లో పెద్ద రచ్చకు కారణమైంది. ఇంతలా దిగజారుడు రాజకీయాలు చేయడమేంటని అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు.