Allu Arjun Met Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి అల్లు అర్జున్.. అరెస్ట్ తర్వాత మావయ్యను సతీ సమేతంగా కలిసిన బన్ని..

Sun, 15 Dec 2024-2:33 pm,

Allu Arjun Met Chiranjeevi:  ఇప్పటికే  అల్లు అర్జున్ ను  సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శర్వానంద్ వంటి హీరోలు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి పరామర్శించారు. ఎన్టీఆర్ ఫోన్ లో బన్నికి అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను పలకరించబోతున్నట్టు వార్తలు వచ్చినా.. ఆయన బన్ని కలవకుండానే వెళ్లిపోయారు.

తాజాగా అల్లు అర్జున్ మావయ్య చిరంజీవి ఇంటికి సతీసమేతంగా కలిసి వెళ్లారు. ఆయనతో భేటి అయ్యారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 సందర్భంగా జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. చిరంజీవితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవాలనుకున్నా కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ తిరిగి విజయవాడ వెళ్లిపోయారు.

బన్నీ స్వయంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు.  భర్య సేహారెడ్డి, కూతురు అర్హాతో కలిసి వచ్చారు అల్లు అర్జున్‌ . సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని అల్లు అర్జున్ కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వీరు చర్చింస్తున్నట్టు సమాచారం.

‘పుష్ప 2’ బెనిఫిట్‌ షో సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ రోజు  రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు.

 

ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు. అర్జున్‌ అరెస్ట్‌ అయ్యాడని తెలియగానే ఎంతో కంగారు పడ్డామని తెలిపారు. చిరంజీవి  కూడా నిన్న షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకుని వచ్చేశారన్నారు సురేఖ. బన్నీ అరెస్ట్‌ అయిన రోజున చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link