Amala: నాగచైతన్య, అఖిల్ విషయంలో తేడాలు చూపిస్తున్న అమల.. ఫ్యాన్స్ ఫైర్..!
ఆ తర్వాత కొంతకాలానికి దగ్గుబాటి లక్ష్మి చెన్నైలో ఉన్న వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అవ్వగా.. నాగార్జున మాత్రం రష్యాకు చెందిన ప్రముఖ హీరోయిన్ అమలను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అక్కినేని అఖిల్ జన్మించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా అక్కినేని నాగచైతన్య తన భార్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు. నాగచైతన్య శోభితకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఏడాది ఆగస్టు 8న సింపుల్ గా జరిపించారు. అయితే వీరిద్దరికి సంబంధించిన నిశ్చితార్థ ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ అమలా షేర్ చేయలేదు. అయితే అప్పుడు ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండరు కాబట్టి.
కానీ నవంబర్ 26వ తేదీన అమల - నాగార్జున కొడుకు అఖిల్.. జైనాబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయాన్ని కూడా నాగార్జున స్వయంగా వెల్లడించారు. అయితే ఈ సమయంలో అమల అఖిల్, జైనాబ్ నిశ్చితార్థ వేడుకకు..సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపింది.
ఇక దీంతో అసలు విషయం బయటపడింది. కొడుకుల విషయంలో అక్కినేని అమల వ్యత్యాసం చూపిస్తోంది అంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య అంటే సవతి కొడుకు కాబట్టి వ్యత్యాసం చూపించింది అని పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా అక్కినేని అమల ప్రవర్తించిన తీరుపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.