Amarapali kata: శివాలెత్తిన ఆమ్రపాలి.. హైడ్రా అధికారులపై సీరియస్.. అసలేం జరిగిందంటే..?

Fri, 13 Sep 2024-9:54 am,

తెలంగాణలో హైడ్రా హల్ చల్ నడుస్తోంది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకుని బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా ఝాళిపిస్తుంది.ఈ క్రమంలో హైడ్రా కాన్సెప్ట్ ను సైతం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. 

అంతేకాకుండా.. ఇటీవల హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని సైతం కేటాయించారు. దీంతో హైడ్రాకు దూకుడు మరింత పెంచిదని చెప్పుకొవచ్చు. హైడ్రా హల్ చల్ తో.. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి కంటి  మీద కునుకు కరువైందని చెప్పుకొవచ్చు. కొన్నిరోజులుగా కొత్తగా ఇళ్ల రిజిస్ట్రేషన్ లు సైతం.. గణనీయంగా తగ్గిపోయిందని సమాచారం.  

ఇదిలా ఉండగా.. హైడ్రాలో జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా జీహెచ్ఎంసీలో..  కార్పొరేషన్ పరిధిలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి, అక్రమాలు, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై విచారణను నిర్వహిస్తుంటాయి. అయితే.. ఈ సిబ్బంది హైడ్రాలో పనిచేస్తున్నారు.   

కానీ వీరిని తిరిగి జీహెచ్ఎంసీ విభాగం విధులు నిర్వర్తించాలని, జీహెచ్ఎంసీ సిబ్బందిని రిలీవ్ చేయాలని కూడా హైడ్రా కమిషనర్ కు జీహెచ్ఎంసీ అనేక పర్యాయాలు లేఖలు సైతం రాసింది. కానీ హైడ్రా నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో ఇటీవల స్థాయి సంఘం మీటింగ్ లో.. సభ్యులు జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఈ విషయాన్ని చెప్పారు.  

కొన్నిరోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో.. విజిలెన్స్ అధికారులు యాక్టివ్ గా లేకపోవడం వల్ల అనేక కార్యక్రమాలకు ఇబ్బందులు వచ్చాయని కూడా ఆమ్రపాలీకి చెప్పారంట. దీంతో ఆమ్రాపాలీ దీనిపై సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీలో ఇదివరకు పనిచేసిన వాళ్లు .. తిరిగి వచ్చేయాలని ఆదేశించారు. సిబ్బంది ఇంకా నెగ్లీజెన్సీగా ఉంటే.. వారికి జీతాలు సైతం నిలిపివేయాలని కూడా పరిపాలన విభాగానికి ఆమ్రపాలీ ఆదేశించారు.

దీంతో తెలంగాణలో.. జీహెచ్ఎంసీ, హైడ్రాల మధ్య కోల్డ్ వార్ వార్తలలో నిలిచింది. జీహెచ్ఎంసీకి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు, అధికారులపై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపి కమిషనర్‌కు నివేదిక అందించాల్సిన బాధ్యత విజిలెన్స్‌ విభాగానిది. దాదాపు నెల రోజులు దాటినా కూడా.. విజిలెన్స్ సిబ్బంది రెస్పాన్స్ కాక పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link