Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్, రాధికల పెళ్లికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. జులై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వీరి పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల్లోని అన్నిరంగాలకుచెందని ప్రముఖులు, వీఐపీలు హజరుకానున్నారు. అంబానీ ఫ్యామిలీ ఇప్పటికే అందరికి ప్రత్యేకమైన ఆహ్వాన పత్రికలను పంపించింది.
ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ రాధికల పెళ్లి వేడుక ముంబైలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసర ప్రాంతంలోని హోటల్స్ ఒక్కసారిగా తమ రూమ్స్ ల ధరలను పెంచేశాయి. సాధారణం కన్న భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అంత ధరలు పెంచి కూడా మరోవైపు అన్ని హోటల్స్‌లోని రూములన్నీ ఇప్పటికే బుక్ అయిపోవడం గమనార్హం. ఈ విషయాన్ని హోటల్, ట్రావెల్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ సోమవారం వెల్లడించాయి.
ముంబైలోని ప్రముఖ హోటల్స్ ట్రైడెంట్, ఒబెరాయి హోటల్స్‌లో రూమ్‌లు ఖాళీ అయితే లేవని సదరు వెబ్‌సైట్ ఈ విషయాలను వెల్లడించాయి. తమ హోటళ్లలో ప్రస్తుతానికి కైతే రూమ్ లు అందుబాటులో లేవని స్పష్టం చేశాయి. అంతేకాకుండా.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసర ప్రాంతాల్లోని హోటల్స్ రూమ్ ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది.
బీకేసీలోని సోఫిటెల్ హోటల్‌లో జులై 8 నుంచి జులై 14 వరకు ధరలు ఇలా ఉన్నాయని వెల్లడించాయి. జులై 8వ తేదీ రూమ్ ధర రూ.15 వేలుగా ఉంటే.. జులై 13న అదే హోటల్ లో రూమ్ ధర రూ.35,060గాను, ఇక జులై 14న రూ. 45,500గా ఉందని వెబ్‌సైట్ ధరలతో స్పష్టం చేసింది.
జులై 10, 11 తేదీలలో ఈ హోటల్‌లో రూమ్స్ అయితే ఖాళీ లేవని పేర్కొంది. అదే విధంగా.. బీకేసీ సమీప ప్రాంతాలోని 5 స్టార్ హోటల్స్.. ది లలిత్, ఐటీసీ మరాఠా, గ్రాండ్ హయత్ , తాజ్ శాంటాక్రాజ్, ఇతర హోటళ్లలో రూములు మాత్రం అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుక దగ్గర పడుతున్న కొలది ఈ హోటల్స్ చార్జీలు లక్ష రూపాయలను దాటేసిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని చర్చ జరుగుతుంది.
ఇదిలా ఉండగా..ఈ నెల 5వ తేదీన ముంబైలో ప్రముఖ పాప్ స్టార్ జస్టిస్ బిబర్ సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కూడా ఎందరో వీఐపీలు హజరయ్యారు. టీ20 విన్నర్స్ జట్టుసైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంత్, రాధిక పెళ్లి వేడుక..జులై 12న వీరి వివాహం జరుగనుంది. జులై 13న శుభ ఆశీర్వాద్, జులై 14న వివాహ రిసెప్షన్ కార్యక్రమంతో అంబానీ ఇంట వివాహ వేడుకలు ముగియనున్నాయి.
మరోవైపు అంబానీ ఇంట వివాహ వేడుకలు నేపథ్యంలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లీస్తున్నట్లు ఇప్పటికే ముంబై నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇవి జులై 12 నుంచి 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. ఈ మేరకు ఆ ఆదేశాలను ఎక్స్ వేదికగా ముంబై పోలీసులు పోస్ట్ చేశారు.