Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ ధర తెరిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎన్ని కోట్లో తెలుసా?

Thu, 02 Jan 2025-9:05 pm,

Anant Ambani wearing a watch price: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గత ఏడాది జులై 12వ తేదీన రాధిక మార్చంత్  వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా కన్నుల పండుగగా ఈ వివాహం జరిగింది. దేశ విదేశాల నుంచి  సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడారంగాల ప్రముఖులు వీరి వివాహం కి హాజరయ్యారు.  పెళ్లికి ముందు ఫ్రీ వెడ్డింగ్, సంగీత్, మెహందీ, హల్ది ఇలా ఎన్నో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వీరి వివాహం దేశ విదేశాల్లో హాట్ టాపిగ్గా మారిందని చెప్పవచ్చు. ఈ జంట పలుమార్లు వార్తల్లో కూడా నిలిచింది  

అయితే అనంత్ అంబానీకి వాచులు అంటే చాలా ఇష్టమట. ఆయన దగ్గర ఎన్నో ఖరీదైన వాచ్లు ఉన్నాయట. ఇప్పుడు ఆయన ధరించిన చేతు గడియారం ధర తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ  రిచర్డ్ మిల్లే ఆర్ఎం 52-04 స్కల్ బ్లూ సఫైర్ వాచ్.. దీని ధర ఎన్ని కోట్లు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇటీవల అనంత్ అంబానీ తన సతీమణి రాధికతో కలిసి బయట కనిపించారు. అప్పుడే ఆయన చేతికున్న వాచీపై  అందరి దృష్టి పడింది.  

ఈ వాచ్ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఐస్ క్యూబ్ మాదిరిగా నీలం రంగుతో  మెరిసిపోతుంది. రిచర్డ్ మిల్లే  బ్రాండ్ కు చెందిన ఈ చేతి గడియారం ధర 22 కోట్ల వరకు ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అనంత్ అంబానీ ధరించిన ఈ తరహా బ్రాండ్ వాచ్లు ప్రపంచంలో కేవలం మూడే ఉన్నాయట. వీటిని అరుదుగా తయారు చేస్తారట. ఎప్పుడు చేతికి గడియారాలపై  ఇంట్రెస్ట్ చూపించే అనంత్ అంబానీ దాంట్లో ఒక్కదాని కొనుగోలు చేశాడంట.

దీంతోపాటు అనంత్ అంబానీ దగ్గర పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి పలు  బ్రాండ్ మోడల్స్ వాచ్ కలెక్షన్ ఉంది. అప్పుడప్పుడు వాటిని ధరిస్తూ కనిపిస్తుంటాడు. గతంలో ఇలాంటి ఒక వాచ్ గురించి మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆయన సతీమణితో అనంత్ అంబానీ మధ్య జరిగిన  సంభాషణ కూడా వైరల్ అయింది.  

గత ఏడాది జులైలోనే  అట్టహాసంగా అనంత-రాధిక వివాహం జరిగింది. కొద్ది నెలల పాటు వేడుకలతో అంబానీ కుటుంబం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ పెళ్లి వేడుకల కోసం వేల కోట్ల ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో పెళ్లికి హాజరైన తన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్ అంబానీ అత్యంత ఖరీదైన గడియారాలు అందజేసిన సంగతి తెలిసిందే.

సుమారు రెండు కోట్ల వరకు పలికేమర్స్ క్యూట్ బ్రాండ్ వాచ్ లను బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ రణ్వీర్ సింగ్ వంటి వారు బహుమతిగా తీసుకున్నారు. ఈ దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link