Ananya Nagalla: ఉగాది వేళ పండగ కళతో ఉట్టిపడుతున్న అనన్య నాగళ్ల.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
అనన్య నాగళ్ల ఎన్ని సినిమాల్లో రానీ గుర్తింపు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాస్‌లో ఈమె పేరు మారిమోగేలా చేసింది.
అనన్య నాగళ్ల కేవలం హీరోయిన్ పాత్రల కోసం ఎదురు చూడకుండా.. క్యారెక్టర్ డిమాండ్ మేరకు నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది
నితిన్ మేస్ట్రోతో పాటు సమంత శాకుంతలం సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసినా.. అనన్యకు పెద్దగా ఉపయోగపడలేదు.
అనన్య నాగళ్ల తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఈమె జన్మస్థలం. అంతేకాదు ఇబ్రహీం పట్నానికి చెందిన రాజా మహేంద్ర కాలేజీలో ఇంజినీరింగ్ చదివింది.
సినిమాల్లో రాకముందు ఈమె ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇన్ఫోసిస్‌లో కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసింది.
అనన్య నాగళ్ల కెరీర్ షురూలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసింది. అందులో ఈమె నటించిన 'షాదీ' అనే షార్ట్ సినిమాలో నటనకు సైమా అవార్డ్‌కు నామినేట్ అయింది. ఈ యేడాది తంత్ర మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.