Anasuya Bharadwaj: అనసూయ ఇళ్లును చూసారా.. స్టార్ హీరోయిన్స్ ను సైతం తలదన్నేలా జబర్దస్త్ బ్యూటీ హౌస్..
జబర్దస్త్ బ్యూటీ ఇద్దరు పిల్లలకు తల్లైనా.. గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఈమె ఇల్లు విషయానికొస్తే.. హైదరాబాద్ ఖరీదైన ప్రాంతంలో ఈమె ఇల్లు ఎంతో లావిష్ గా ఉంది.
యాంకర్ గా సంపాదించిన దాంట్లో భూములపై ఇన్వెస్ట్ చేసింది. అందులో ఓ మంచి ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకుంది. ఈ ఇంట్లో హీరో, హీరోయిన్స్ ఇళ్లలో మాదిరి ల్యాన్.. స్విమ్మింగ్ ఫూల్ వంటివి ఉన్నాయి.
మొత్తంగా స్టార్స్ హీరోయిన్స్ తలదన్నేలా ఈమె ఇల్లు ఉంది. టెలివిజన్ తెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఆపై సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండం అనసూయ స్టైల్.
అనసూయ సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం అనసూయ చేతిలో భారీ బిగ్ బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. త్వరలో ఈమె పుష్ప 2 మూవీతో పలకరించబోతుంది.
జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో వరుసగా సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు అక్కడ స్క్రీన్ పై తన యాక్టింగ్ తో ఫిదా చేసి ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది.
అనసూయకు యాక్ట్రెస్ గా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం ‘రంగస్థలం’. ఈ మూవీలో రంగమ్మత్తగా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. రంగస్థలం తర్వాత పుష్ప సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.