Anasuya: చీరకట్టులో చందమామలా కనిపిస్తున్న అనసూయ.. ఫొటోస్ వైరల్..
జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ అందుకున్న అనసూయ.. యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అంతేకాదు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తో రంగమ్మత్త గా భారీ పాపులారిటీ అందుకుంది అనసూయ. ఇటీవల వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలలో విలన్ గా దాక్షాయిని పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అలాగే ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను.. అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది అని సమాచారం.
ఒకవైపు సినిమాలు, మరొకవైపు బుల్లితెర షోలు చేస్తూ ఇంకొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకునే అనసూయ తాజాగా మరోసారి చీరకట్టులో అబ్బురపరిచింది.
బిస్కెట్ కలర్ చీర ధరించి దానికి కాంబినేషన్లో పింక్ కలర్ బ్లౌజ్ తో దేవకన్యలా అనిపించింది. ముఖ్యంగా చీరకట్టులో చందమామలా అందరిని ఆకట్టుకుంది అనసూయ.
చాలాకాలం తర్వాత మళ్లీ ఇలా చూశామంటూ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతు.. మరోసారి అనసూయని వార్తల్లో నిలిపేలా.. చేశాయి.