Anchor Rashmi: స్లివ్‌లెస్ బ్లౌజ్‌లో చించేసిన యాంకర్ రష్మీ.. అదిరిపోయిన ఫొటోషూట్..!
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టిన రష్మీకి బిగ్ స్క్రీన్‌పై పెద్దగా పేరు రాలేదు. జబర్దస్త్ షోతో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన తరువాత క్రేజ్ మారిపోయింది.
ఈ షోలో సుడిగాలి సుధీర్‌తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెరపై మాత్రమే వీరిద్దరి ప్రేమ అని తెలిసినా.. బుల్లితెర అభిమానులు మాత్రం ఈ జంటను చూసేందుకు తెగ ఇష్టపడతారు.
వీరిద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటే చాలా మంది సంతోషించే వారు కూడా ఉన్నారు. స్క్రిప్ట్‌లో భాగంగా బుల్లితెర ప్రోగ్రామ్స్‌లో వీరిద్దరికి చాలా సార్లు పెళ్లైంది.
ఇక అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తున్న రష్మీ.. రీసెంట్‌గా చిరంజీవి భోళా శంకర్‌లో కూడా ఓ చిన్న పాత్ర పోషించింది. అయితే ఇది రష్మీ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.
తాజాగా శారీలో రష్మీ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. స్లివ్‌లేస్ బ్లౌజ్‌లో చురకత్తుల చూపులతో మైమరిపించింది.