Varshini Sounderajan Pics : పొట్టి గౌనులో యాంకర్ వర్షిణి.. అంతకు మించి అనేలా అందాల ప్రదర్శన

Mon, 14 Nov 2022-8:35 am,

యాంకర్ వర్షిణి బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ముందుగా అందరికీ ఆకట్టుకుంటుంది. అందులో అభిజిత్, వర్షిణి జోడికి అంతా ఫిదా అయ్యారు.

ఢీ షోతో బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొదట్లో డ్యాన్సు రాదని, స్టెప్పులు వేయలేదని సెటైర్లు వేసేవారు. కానీ సీజన్ ముగిసే సరికి అంతో ఇంతో నేర్చుకుని ఢీ స్టేజ్ మీద డ్యాన్సులు వేసింది.

బుల్లితెరపై మంచి పీక్స్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చింది వర్షిణి. ఈటీవీ నుంచి వెళ్లి స్టార్ మాలో జాయిన్ అయింది. కామెడీ స్టార్స్ చేసింది. అలా బుల్లితెరపై తనకంటూ డిమాండ్‌ను క్రియేట్ చేసుకుంది.

బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సిల్వర్ స్క్రీన్ ఆఫర్లు వచ్చాయి. దీంతో వర్షిణి సినిమాల మీదే ఫోకస్ పెట్టేసింది. మళ్లీ మొదలైంది, సమంత శాకుంతలం వంటి చిత్రాలు చేసింది.

వర్షిణి చేతిలో ఇప్పుడు కొన్ని సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో ఇలా పొట్టి బట్టలు వేసుకుని ఆహాలో చేస్తోన్న డ్యాన్స్ ఐకాన్ షోకోసం వచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link