AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..
AP Liquor Rates: ఒకప్పుడు తాగడానికి మంచి నీళ్లు అందుబాటులోకి తీసుకొస్తాము. రోడ్లు వేస్తాము. తాగుడు వ్యసనం నుంచి దూరం చేస్తామంటూ ఒకప్పుడు రాజకీయ నాయకులు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు. కానీ కాలం మారింది. తాగితే తప్పేముంది అనడంతో పాటు తక్కువ ధరకే లిక్కర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని హామి ఇచ్చి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అంతేకాదు అధికారం చేపట్టిన వంద రోజుల్లోపే లాటరీ విధానంలో కొత్త మద్యం షాపులకు అనుమతులు ఇచ్చింది. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పోరేషన్ కొనే మధ్యం ధరకు సంబంధించిన బేసిక్ ధరను నిర్ణయించేందుకు ఓ టెండర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా.
అంతేకాదు త్వరలో మద్యాన్ని టెట్రా ప్యాకుల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పోరేషన్. అంతేకాదు కొత్తగా వచ్చిన మద్యం దుకాణాలతో మందు బాబులకు తక్కువ ధరకే నాణ్యమైన లిక్కర్ లభించడంతో వారు పండగ చేసుకుంటున్నారు.
తాజాగా మాన్షన్ హౌస్ ధర క్వార్టర్ ధర.. రూ. 220 నుంచి రూ. 190కు తగ్గింది. అదే హాఫ్ బాటిల్ మద్యం ధర రూ. 440 నుంచి రూ 380కు తగ్గింది. అటు ఫుల్ బాటిల్ ధర రూ. 870 నుంచి రూ. 760కు తగ్గింది.
అటు రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర.. రూ. 230 నుంచి రూ.210కు తగ్గింది. అటు ఫుల్ బాటిల్ రూ. 907 నుంచి రూ 840కు తగ్గింది. యాంటీక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ. 1600 నుంచి రూ. 1400 తగ్గించారు.
అటు జగన్ హయాంలో రూ. 130కు దొరికే మద్యం ధర.. తాజాగా కొలువు దీరిన కూటమి ప్రభుత్వం రూ. 99కు తీసుకొచ్చారు. త్వరలో మరిన్ని మద్యం ధరలను తగ్గించే యోచనలో సర్కారు ఉంది. తగ్గించిన మద్యం ధరలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.