AP Liquor MRP Rates: మందుబాబుల కోసం ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఇకపై అలా అమ్మితే బొక్కలో వేయడమే..
AP Liquor MRP Rates: ఏపీలో మందుబాబులు కోరిన లిక్కర్ ను ఎంఆర్పీ కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ రేటుకు అమ్మితే వారి తాట తీస్తామంటోంది అక్కడి ప్రభుత్వం. దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంఆర్పీ రేటు పై తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ప్రభుత్వానికి తెలియకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. బెల్ట్ తీయడం తప్పదంటున్నారు. గత కొన్ని రోజులుగా కొంత మంది మద్యం వ్యాపారులు మద్యం బాటిల్స్ పై ఉన్న ధర కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ఎమ్మార్పీ (మాక్సిగమ్ రిటేల్ ప్రైస్) కంటే ఎక్కువ రేట్స్ లకు లిక్కర్ అమ్మే షాపులపై కొరడా ఝలిపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది.ఇప్పటికే దానికి సంబంధించిన కార్యాచరణకు నడుం బిగించింది.
అంతేకాదు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ. 5 లక్షల వరకు జరిమాన విధించనుంది. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయనుంది.
అంతేకాదు వైన్ షాపులు నిర్వహించే పరిధిలో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించినా రూ. 5 లక్షల వరకు జరిమానా విధించనుందట.
మరోవైపు ఎవరైతే రెండోసారి ఎక్కువ రేటుకు అమ్మడం చేస్తే.. సదరు బార్ లేదా మద్యం షాపు లైసెన్స్ రద్దు చేయనుంది. ప్రభుత్వం మద్యం షాపులపై తీసుకున్న ఈ నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.