AP Liquor Rates: ఏపీలో మందు బాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. మందు రేట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
AP Liquor Rates: రైటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జిస్టస్ టి. సునీల్ చౌదరీ చైర్మన్గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.ఇందులో ప్రముఖ సీఏ ఎం. మాచర్ రావు, రిటైర్డ్ ఐఎస్ బీర్ మీనా సభ్యులుగా ఈ కమటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇకపై ఏ మద్యం ధరపై కనీస ఛార్జ్ విషయంలో బేవరేజెస్ కార్పోరేషన్ తో పాటు మద్యం సరఫరా దార్లతో చర్చించి వీరు ధరలను ఖరారు చేస్తారు.
అంతేకాదు వీరు ఎప్పటి కప్పుడు క్షేత్ర పరిస్థితులను బట్టి మద్యం ధరలను నిర్ణయిస్తారు. అంతేకాదు త్వరలో ఏపీలో రానున్న కొత్త బ్రాండ్స్ మద్యం ఎంత ధర ఉండాలనే దానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుది. ముఖ్యంగా మద్యం అమ్మకాల్లో టెట్రా ప్యాక్ ప్రవేశపెట్టడంపై వీరు ఆలోచనలు చేస్తున్నారు. దాంతో పాటు చిన్న సీసాల్లో మద్యం అమ్మకాలు కూడా ఇందులో భాగంగా ఉండనున్నాయి.
అంతేకాదు ఈ కమిటీ విధి విధానాలు, మద్యం ధరలతో పాటు వీరి విధులు, విధి విధానాలు ఎలా ఉండాలనే దానిపై ఎక్సైజ్ శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేసారు. మొత్తంగా ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై కొత్త మద్యం బేసిక్ ప్రైస్ ను నిర్ణయించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువైన తర్వాత మద్యం షాపులను లాటరీ విధానంలో కేటాయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం బాబులకు నాణ్యమైన మద్యం ఈ షాపుల ద్వారా లభిస్తోంది. ఇప్పటికే గవర్నమెంట్ రూ 99కే క్వార్టర్ బాటిల్ ను షాపుల్లో మందు బాబులకు అందుబాటులో ఉంచింది. కొత్త ఏర్పాటు చేసిన షాపుల్లో అన్ని రకాల బ్యాండ్స్ దొరకడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అంతేకాదు గత నెలలో కొన్ని ప్రీమియం బ్యాండ్స్ మద్యంతో పాటు బీర్లకు చాలా కొరత ఏర్పడింది.
మద్యం వ్యాపారులు ఆర్డర్స్ పెడుతున్నా.. కానీ మద్యం కంపెనీలు మాత్రం సరైన సమయానికి మద్యాన్ని సరఫరా చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా మెక్ డొవెల్స్, ఇంపీరియల్ బ్లూ వంటి ప్రీమియర్ బ్రాండ్స్ కు తీవ్ర కొరత ఏర్పడింది. అటు బీర్లలో కూడా బడ్ వైజర్, కింగ్ ఫిషర్ వంటి బ్రాండ్స్ కు తీవ్ర కొరత ఏర్పడింది.
మందుబాబులు అడిగిన బ్రాండ్స్ లేకపోవడంతో బిజినెస్ డల్ గా నడుస్తున్నట్టు మద్యం వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు వ్యాపారులు.. 10 కేసులకు ఆర్డర్ పెడితే.. కనీసం అందులో ఒక్కటిగా రావడం లేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన బెల్టు షాపుల్లో ఎక్కు రేటుకు లిక్కర్ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. నిబంధనలను సరిగా పాటించని వాళ్ల షాపులను ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు.
మరోవైపు ఏపీలో లిక్కర్ షాపులు దక్కించుకున్న వ్యాపారులకు గిట్టుబాటు కావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో మద్యం సీసాపై 20 శాతం వరకు ఎక్స్ పెక్ట్ చేస్తే.. అందులో 8 నుంచి 10 మద్యే వస్తుందని ఆవేదన వెల్లగక్కుతున్నారు. ఇలాగైతే వ్యాపారాలు చేయడం కష్టమంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం మార్జిన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.