Andrea Meza: మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా గురించి ఆసక్తికర విశేషాలు

Mon, 17 May 2021-2:50 pm,

మెక్సికో సుందరి ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌(Miss Universe 2020)గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలో ఆదివారం రాత్రి జరిగిన అందాల పోటీల ఫైనల్లో గెలుపొందిన ఆండ్రియా మెజా విశ్వ సుందరిగా నిలిచారు. మెక్సికో భామ విజేతగా నిలవగా, భారత్‌కు చెందిన అడెలిన్‌ కాస్టెలినో మూడో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. 

Also Read: Miss Universe 2020: మెక్సికో భామ ఆండ్రియా మెజాకు విశ్వసుందరి కిరీటం, టాప్ 5లో భారత సుందరి

మెక్సికోలోని చిహువాహువా నగరంలో 13 ఆగస్టు 1994లో చైనా-మెక్సికో దేశాలకు చెందిన దంపతులు అల్మా కర్మోనా, శాంటియాగో మెజాలకు ఆండ్రియా మెజా జన్మించింది. 

26 ఏళ్లు పైగా వయసుతో మిస్‌ యూనివర్స్‌ టైటిల్ నెగ్గిన అతిపెద్ద వయసు విజేతలలో ఆండ్రియో మెజా ఒకరు. గతంలో అమెరికాకు చెందిన బ్రూక్ లీ 26 ఏళ్ల 128 రోజులకు విశ్వసుందరి కిరీటం గెలుచుకుంది. 

Also Read: COVID-19 Vaccination: మీకు దగ్గర్లోని కోవిడ్19 టీకా కేంద్రాన్ని WhatsApp ద్వారా తెలుసుకోండి

ఈ మెక్సికన్ బ్యూటీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అదే సమయంలో మోడలింగ్‌ను సైతం తన కెరీర్‌గా ఎంచుకుని సాగుతున్నారు.

లుపిటా జోన్స్ (1991), జిమెనా నవర్రెటె (2010) తరువాత విశ్వసుందరి టైటిల్ కైవసం చేసుకున్న మెక్సికో సుందరిగా ఆండ్రియా మెజా నిలిచారు.

Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే

2017లో మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు మెక్సికన్ భామ. మిస్ మెక్సికో 2017గా సైతం అందాల పోటీలలో విజయం సాధించారు. దాంతో తన అందంపై నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఆండ్రియా మెజా మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.

2020లో మెక్సికానా యూనివర్సల్ చిహువాహువా పోటీల్లో విజయం సాధించారు. ఆపై మెక్సికానా యూనివర్సల్ 2020 పోటీల్లో ఆరు ఛాలెంజ్‌లు ఎదుర్కొని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఫైనల్ చేరుకుంది. 20 నవంబర్ 2020న జరిగిన ఫైనల్లోనూ విజేతగా నిలిచారు.

Also Read: RRR movie గురించి చెబితే రాజమౌళి గొడ్డలి పట్టుకొని వస్తాడు

Miss Universe 2020 : కరోనా కారణంగా గత ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించలేదు. దాంతో ఏడాదిపాటు మిస్ యూనివర్స్ అందాల పోటీలకు ఆసక్తిగా ఎదురుచూసింది. గతంలో ఎన్నో వేదికలపై తన అందాన్ని, ఆత్మస్తైర్యాన్ని నిరూపించుకున్న ఆండ్రియా మెజా ఈసారి విశ్వ సుందరి 2020గా గెలుపొందారు.

మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. లింగ సమానత్వం లక్ష్యంగా, లింగ వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన పలు నిరసన కార్యక్రమాలలో మిస్ యూనివర్స్ ఆండ్రియా మెజా పాల్గొన్నారు. ఆమె స్వతహాగా మేకప్ ఆర్టిస్ట్ అయితే జంతు హింసకు ఆమె పూర్తిగా వ్యతిరేకం. అందువల్ల ఆమె వీగన్‌గా మారిపోయారు.

అందం అనేది పైపై మెరుగులు మాత్రమే చూపిస్తుందని ఆండ్రియా మెజా నమ్ముతారు. ఆత్మస్థైర్యం, మనోధైర్యం, ఇతరులకు సహాయం చేయాలనుకునే గుణమే అసలైన అందమని ఆమె తన సమాధానాన్ని చెప్పారు. ఇతరులు మన విలువలను, నైతికతను తప్పుపడుతూ, ప్రశ్నించని వ్యక్తులే అసలైన అందెగత్తెలు అని చెప్పి మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link