Alla Nani: వైఎస్ జగన్‌కు కోలుకోలేని దెబ్బ.. టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని?
ఎదురుదెబ్బ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగలనున్నట్టు సమాచారం.
డిప్యూటీ సీఎంగా: తన హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడు ఆళ్ల నాని పార్టీని వీడనుండడం ఖాయంగా కనిపిస్తోంది.
చేరికకు సిద్ధం: తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆళ్ల నాని పూర్తి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
రేపే చేరిక: అన్ని కలిసి వస్తే బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్త ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
రాజీనామా: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని టీడీపీలో చేరనుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
పశ్చిమలో: పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి కీలక నాయకుడిగా ఉన్న ఆళ్ల నాని ఏలూరు ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు.
అభ్యంతరం: తెలుగుదేశం పార్టీలో ఆళ్ల నాని చేరికను స్థానిక ఏలూరు టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బడేటి చంటి: 'ఆళ్ల నాని చేరికపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం' అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెబుతున్నారు.