Anupama Parameswaran: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనుపమ…ఫోటోలు చూసి అదరహో అంటున్న ఫ్యాన్స్

Mon, 19 Feb 2024-4:12 pm,

Anupama Parameswaran Vacation Snaps: ప్రేమమ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ పరమేశ్వరం ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా చేసిన అ..ఆ సినిమాలో నాగవల్లి పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది.

ఈ సినిమాతో యువత హృదయాలను ఆకట్టుకున్న ఈ హీరోయిన్ ఆ తరువాత వచ్చిన శతమానం భవతి చిత్రంలో హీరోయిన్ గా చేసి మంచి విజయం అందుకుంది.

మలయాళీ.. తమిళ చిత్రాలలో సైతం నటించిన అనుపమ…తెలుగులో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది.

ఈమధ్య వచ్చిన నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా పరంగా పేరు తెచ్చుకునింది ఈ ఉంగరాల జుట్టు సుందరి.

ఆ తర్వాత మరోసారి నిఖిల్ తో 18 పేజెస్ అనే చిత్రంలో మెరిసిన అనుపమ ఈమధ్య రవితేజ హీరోగా చేసిన ఈగల్ సినిమాలో సైతం హీరోయిన్ గా నటించింది.

కాగా అనుపమ తన 28వ పుట్టినరోజు జరుపుకున్న తీరు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె 28వ పుట్టినరోజు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ఆ వెకేషన్ నుంచి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link