Anushka Sen Photos: జిమ్ వేర్లో అనుష్క సేన్ అందాలు అదరహో.. వేడి సమ్మర్లో మరింత వేడెక్కిస్తోంది!
అనుష్క శెట్టి తెలుసు, అనుష్క శర్మ తెలుసు ఎవరీ అనుష్క సేన్ అనుకుంటున్నారా? అయితే నిజానికి ఆమె ఒక టీవీ నటి. తెలుగులో బాలవీర్ అనే సీరియల్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఆ తరువాత ఝాన్సీ లక్ష్మే భాయి సీరియల్ లో కూడా నటించింది.
ఇక అనుష్క సేన్ 2009లో జీ టీవీ సీరియల్ యహాన్ మైన్ ఘర్ ఘర్ ఖేలీతో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక 2012లో ఆమె మొదటి మ్యూజిక్ వీడియో హమ్కో హై ఆషా విడుదలైంది.
2015లో, ఆమె బాలీవుడ్ చిత్రం క్రేజీ కక్కాడ్ ఫ్యామిలీలో కూడా కనిపించింది . ఆమె టీవీ సీరియల్స్ ఇంటర్నెట్ వాలా లవ్, డెవాన్ కే దేవ్...మహదేవ్ లలో నటించింది.
2019 సిరీస్ ఖూబ్ లడీ మర్దానీ - ఝాన్సీ కి రాణిలో రాణి లక్ష్మీ బాయి అనే చారిత్రక పాత్ర పోషించి మరింత మంచి పేరు తెచ్చుకుంది.
ఇక మే 2021లో, ఆమె స్టంట్-ఆధారిత రియాలిటీ టీవీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 11లో ఎంట్రీ ఇచ్చి ఏడవ వారంలో ఎలిమినేట్ అయింది. ఈ షోలో కనిపించిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె నిలిచింది.