Ali Daughter Wedding Reception: అంగరంగ వైభవంగా అలీ కుమార్తె రిసెప్షన్.. హాజరైన జగన్!

Tue, 29 Nov 2022-10:25 pm,

ప్రముఖ నటుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు, వైసీపీ నేత మహమ్మద్ అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ మంగళవారం గుంటూరు శ్రీ కన్వర్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది.   

 

ఇక ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ జగన్ మాత్రమే కాకుండా ఆయనతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.    

 

ఇక ఈ కార్యక్రమానికి మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. 

 

మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం, డిప్యూటీ మేయర్ సుజీలా, డైమండ్ వాజ్రా బాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు.   

 

ఇక వీరు మాత్రమే కాకుండా గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ సహా అనేక మంది ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.   

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link